twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మధుర శ్రీధర్ ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ టాకేంటి?

    By Bojja Kumar
    |

    Back Bench Student
    హైదరాబాద్ : స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాలతో తనకంటూ ప్రత్చేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మధుర శ్రీధర్ తాజాగా 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహత్ రాఘవేంద్ర, పియా భాజ్ పాయ్, అర్చన కవి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

    ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రేమాయణం నేపథ్యంలో యువతరాన్ని ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించామని దర్శక నిర్మాతలు ముందునుండీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. సినిమా ఆద్యంతం బోరింగ్‌గా ఉండటం, నేరేషన్ స్లోగా ఉండటం చాలా మందిని నిరాశ పరిచింది.

    మరో వైపు సినిమాలో ఎంటర్ టైన్మెంట్ పాళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే నటన విషయంలో మహత్ రాఘవేంద్ర, పియా, అర్చన బాగా చేసారు. టెక్నికల్ అంశాల విషయంలో మ్యూజిక్ పర్వాలేదు. అయితే ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. ఇతర అంశాలు ఫర్వాలేదు. విషయం కొత్తగా లేక పోవడం, స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా లేక పోవడం ఈ సినిమాకు మరో మైనస్. మరి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రాన్ని ఎంవికె రెడ్డి నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ప్రసాద్ జికె సినిమాటోగ్రాఫీ అందించారు.

    English summary
    'Back Bench Student' movie get avarage talk. Backbench Student directed by Madhura Sreedhar Reddy. The film stars Mahat Raghavendra, Piaa Bajpai and Archana Kavi. BBS is produced by M.V.K. Reddy on the Shirdi Sai Combines banner and presented by Multidimension Entertainments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X