»   » 66 అడుగుల భారీ పోస్టర్ అదిరింది (ఫోటోస్)

66 అడుగుల భారీ పోస్టర్ అదిరింది (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణం ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసింది.

బాజీ రావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా.... అతని ప్రియురాలు మస్తానీ పాత్రలో దీపిక పదుకోన్ నటిస్తోంది. బాజీరావ్‌ భార్య కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాలోని ‘దీవాని మస్తానీ' అనే సాంగులో దీపిక పదుకోన్ లుక్ అదిరిపోయింది. తాజాగా 66 ఫీట్ల పోస్టర్ విడుదల చేసారు.

ఈ పోస్టర్లో యుద్ధ వీరుడి పాత్రలో రణవీర్ సింగ్ అదిరిపోయింది. డిసెంబర్ 18న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

బాజీరావ్‌గా గుండు, కోరమీసంతో రణ్‌వీర్‌ కొత్తగా కనిపిస్తున్నారు. నుదుట చందన తిలకం, చెవిదుద్దులు, బంగారు పూసల దండలు ధరించిన ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. బాజీరావ్‌ ప్రేయసి మస్తానీగా నటిస్తున్న దీపికా పదుకోన్ చేతిలో విల్లుతో వీరనారిలా సినిమాలో కొన్ని సీన్లలో కనిపించబోతోంది.

ఫస్ట్ అఫీషియల్ పోస్టర్

‘బాజీరావ్ మస్తానీ' సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్.

66 అడుగుల పోస్టర్

సినిమా ప్రమోషన్లో భాగంగా 66 ఫీట్ల పొడవుతో పోస్టర్ రూపొందించారు.

రణవీర్ సింగ్

పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి రణవీర్ సింగ్ ఇలా డిఫరెంటుగా హాజరయ్యాడు.

రణవీర్ సింగ్

పోస్టర్ విడుదలకు ముందు మాట్లాడుతున్న రణవీర్ సింగ్.

మీడియా

పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులు

 

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos