»   » బాలయ్య 41 ఇయర్స్ ఇండస్ట్రీ (ఫోటో ఫీచర్)

బాలయ్య 41 ఇయర్స్ ఇండస్ట్రీ (ఫోటో ఫీచర్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న బాలయ్య నేటితో (జులై 29, 2015) తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తయింది. బాలయ్య నటించిన తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 41 సంవత్సరాలు పూర్తయింది.

1974, జులై 29వ తేదీన బాలయ్య ‘తాతమ్మ కల'చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. ఈ చిత్రంలో ఆయన భానుమతి మనవడిగా నటించారు. ఈ చిత్రానికి బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించడం విశేషం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా వెండితెరపై వెలుగొందుతున్నాడు నందమూరి బాలకృష్ణ 100వ సినిమాకు చేరువయ్యారు.


మద్రాసులో 1960, జూన్‌ 10న జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌కి ఆరో సంతానం. డిగ్రీ వరకు చదువుకున్నారు. 1974లో 14 ఏళ్ళ వయసులోనే బాలనటుడిగా తాతమ్మ కల చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన రామ్‌ రహీం చిత్రంలో నటించి నటనపై తనకున్న మక్కువను చాటారు.


ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నదమ్ముల అనుబంధం' చిత్రంలో నటించి తన నటవారసత్వాన్ని కొనసాగించారు. ఆ తరువాత తన తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు.


బాలయ్య కెరీర్లో టాప్ 10 సినిమాలు ఇవే...


మంగమ్మ గారి మనవడు

మంగమ్మ గారి మనవడు

బ్యానర్ : భార్గవ్ ఆర్ట్స్
డైరక్టర్ : కోడి రామకృష్ణ
నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి
విడుదల సంవత్సరం: 1984
‘మంగమ్మగారి మనవడు'. సినిమా శ్లాబ్‌లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో విడుదలైన ఆ సినిమా సంచలనాలకు కేంద్రబిందువు అయ్యింది. 500 రోజులు ప్రదర్శితమై ఎన్టీఆర్ వారసుడి సత్తా ఏంటో తెలియజేసింది.


అనసూయమ్మగారి అల్లుడు

అనసూయమ్మగారి అల్లుడు

బ్యానర్ : రామకృష్ణ స్టూడియోస్
డైరక్టర్ : కోదండ రామిరెడ్డి
నిర్మాత : నందమూరి జయకృష్ణ
విడుదల సంవత్సరం: 1986
హోమ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. పొగరుమోతు అత్త తో అల్లుడు సవాల్ తో నడిచే ఈ చిత్రం ఇప్పటికీ బాలయ్య అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. బాలయ్యలోని స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద తేల్చి చెప్పిన చిత్రం ఇది.


సీతారామ కళ్యాణం

సీతారామ కళ్యాణం

బ్యానర్ : యువ చిత్ర
డైరక్టర్ : జంథ్యాల
నిర్మాత : కె.మురారి
విడుదల సంవత్సరం: 1987
1986-87లో బాలకృష్ణ వరసగా భాక్సాఫీస్ వద్ద 5 హిట్స్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసారు. దేశోధ్దారకుడు, అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, సీతారామ కళ్యాణం, అపూర్వ సహోదరులు. ఇక సీతారామ కళ్యాణం చిత్రం..ఫ్యాన్స్ కు అతీతంగా అందరూ చూసి ఆనందించారు రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అందించారు. రాళ్ళల్లో ఇసుకల్లో పాట ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉంటుంది.


ముద్దుల మావయ్య

ముద్దుల మావయ్య

బ్యానర్ : భార్గవ ఆర్ట్స్
డైరక్టర్ : కోడి రామకృష్ణ
నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి
విడుదల సంవత్సరం: 1989
తమిళ రీమేక్ గా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ముద్దుల మామయ్య. ఎన్టీఆర్ రక్త సంభందం లాంటి అన్న -చెల్లెళ్ళ సెంటిమెంట్ ని బలంగా చూపిన ఈ చిత్రం బాలయ్యకు ఫెరఫెక్ట్ ఫిల్మ్ గా రికార్డులు క్రియేట్ చేసి నిలిచిపోయింది.


ఆదిత్య 369

ఆదిత్య 369

బ్యానర్ : శ్రీదేవి ఆర్ట్ మూవీస్
డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత : అనిత ప్రసాద్
విడుదల సంవత్సరం: 1991
మాస్ హీరోకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన బాలయ్య...ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఒప్పుకోవటం అందరికీ ఆశ్చర్యం. ముఖ్యంగా ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయులు గెటప్ ఎవరూ మర్చిపోలేరు. జానవులే.., రాసలీల వేళ పాటలు అప్పట్లో మెగా హిట్.


రౌడీ ఇన్స్ స్పెక్టర్

రౌడీ ఇన్స్ స్పెక్టర్


బ్యానర్ : విజయలక్ష్ణి ఆర్ట్ మూవీస్
డైరక్టర్ : బి . గోపాల్
నిర్మాత : టి. త్రివిక్రమరావు
విడుదల సంవత్సరం: 1992
ఎన్టీఆర్ తో జస్టిస్ చౌదరి వంటి హిట్ ఇచ్చిన బ్యానర్ లో బాలయ్య చేసిన సినిమా ఇది. అంతకు ముందు లారీ డ్రైవర్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన బి.గోపాల్ తో చేసిన ఈ చిత్రం సంచలన విజయం సాథించింది. ఎక్కడ విన్నా ఈ పాటలే వినపడేవి. విజయశాంతి కూడా ఈ సినిమాలో అదరకొట్టింది.


భైరవ ద్వీపం

భైరవ ద్వీపం

బ్యానర్ : చందమామ విజయ కంబైన్స్
డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత : బి.విశ్వనాథ రెడ్డి
విడుదల సంవత్సరం: 1994
మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో ఆణిముత్యాలు అందించిన "విజయ" బ్యానర్ అంటే తెలియదు. వారు చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత చేసిన చిత్రం ఇది. జానపద చిత్రం గా వచ్చిన ఈ చిత్రం బాలయ్య ఎలాంటిపాత్ర కైనా ప్రాణం పోస్తాడని ప్రూవ్ చేసింది.


సమర సింహా రెడ్డి

సమర సింహా రెడ్డి

బ్యానర్ : శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్
డైరక్టర్ : బి.గోపాల్
నిర్మాత : చంగల వెంకట్రావు
విడుదల సంవత్సరం: 1999
బాలకృష్ణ పని అయిపోయింది...అనుకున్న టైమ్ లో మిస్సైల్ లా దూసుకు రావటానికి దోహదం చేసిన చిత్రం ఇది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి తెలుగు సినిమా ప్రేరణ పొందుతోందంటే ఈ చిత్రం గొప్పతనం ఏమిటో ఆర్దం చేసుకోవచ్చు. రాయలసీమ ఫ్యాక్షన్స్ మీద ఓ రివేంజ్ స్టోరీని అల్లి బాలయ్య నటనతో ఘన విజయం సాధించారు.


నరసింహ నాయుడు

నరసింహ నాయుడు

బ్యానర్ : వెంకట రమణ ప్రొడక్షన్స్
డైరక్టర్ : బి.గోపాల్
నిర్మాత : మేడికొండ మురళి కృష్ణ
విడుదల సంవత్సరం: 2001 భాక్సాఫీస్ కు సెన్సేషనల్ హిట్ అనేది తెలియచేసిన చిత్రం ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్ కు కుటుంబాల పగ ను కలిసి అల్లిన ఈ కథ బాలకృష్ణ కెరీర్ లో విపరీతమైన ఊపు తెచ్చింది. చాలా కాలం తర్వాత 275 ఆడిన సినిమా ఇది.


సింహా

సింహా

బ్యానర్ : యునైటెడ్ మూవీస్
డైరక్టర్ : బోయపాటి శ్రీను
నిర్మాత : పరుచూరి కిరీటి
విడుదల సంవత్సరం: 2010
బాలకృష్ణకు వరస ఫ్లాపులు..బాలయ్యతో సినిమా అంటే కష్టం అంటూ అంతా చేతులు ఎత్తేస్తున్నారు. అయితే సరైన సినిమా పడితే బాలకృష్ణ ఎప్పుడూ భాక్సాఫీస్ సింహమే...అని ప్రూవ్ చేసిన చిత్రం ఇది.


లెజెండ్

లెజెండ్

బ్యానర్: 14 రీల్స్ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
విడుదల తేదీ 2014
ఇటీవల విడుదలైన లెజెండ్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య ఎమ్మెల్యేగా గెలవడానికి బాగా తోడ్పడిందనే వాదనకూడా ఉంది.


English summary
Balayya Completes 41 Years in TFI. In 1974, NBK acted as a child artist in Tatamma Kala which was directed by NTR. Over a period of time he acted in several films, many of them were directed by NTR.
Please Wait while comments are loading...