twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ మూవీలో ఆ వివాదాలు చూపిస్తారా? బాలయ్య ఈ రోజు ఏమన్నారంటే...

    ఎన్టీఆర్ జీవితంలోని వివాదాలను చూపిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశం అయంది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దివంగ‌త ముఖ్య‌మంత్రి, సినీన‌టుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై సినిమా తీస్తానని ఆయన తనయుడు, నటుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్రకటించగానే అభిమానుల్లో, తెలుగు ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం. దీంతో పాటు అనేక సందేహాలు, అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి.

    బాలయ్య ఈ సినిమా గురించి ప్రకటించడంతో.... ఆయన ఎక్కడికెళ్లినా మీడియా వారు ఈ సినిమా గురించే ప్రశ్నలు వేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి ఏం చూపించబోతున్నారు అనేది ఇపుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

    ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారా? లేక పొలిటికల్ జర్నీని హైలెట్ చేసి చూపిస్తారా? వీటితో పాటు ఆయన జీవితంలోని వివాదాలను చూపిస్తారా? అనేది చర్చనీయాంశం అయంది. అసలు సినిమా ఎక్కడ మొదలు పెట్టి? ఎక్కడ ముగిస్తారు? అనే ఒక ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

    బాలయ్య ఈ రోజు ఏమన్నారంటే...

    బాలయ్య ఈ రోజు ఏమన్నారంటే...

    విజయవాడలో మంగళవారం బాలయ్య మీడియా సమావేశంలో పాల్గొనగా ఆయనకు మీడియా వారి నుండి సినిమాకు సంబంధించిన విశేషాల గురించి ప్రశ్నించారు. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను ఎక్క‌డ మొద‌లు పెట్టాలో.. ఎక్క‌డ‌ ముగించాలో త‌న‌కు తెలుసని బాలయ్య అన్నారు.

    ప్ర‌జ‌ల‌కు తెలిసిన విష‌యాల‌తో పాటు తెలియ‌ని అంశాల‌ని కూడా

    ప్ర‌జ‌ల‌కు తెలిసిన విష‌యాల‌తో పాటు తెలియ‌ని అంశాల‌ని కూడా

    ప్ర‌జ‌ల‌కు ఎన్టీఆర్ గురించి గొప్ప‌ద‌నాన్ని చెప్పాల్సిన బాధ్యత త‌మ‌పై ఉంద‌ని చెప్పిన బాలయ్య ఎన్టీఆర్ గురించి ప్ర‌జ‌ల‌కు తెలిసిన విష‌యాల‌తో పాటు తెలియ‌ని అంశాల‌ని కూడా చూపిస్తామ‌ని అన్నారు.

    తెరపైకి పూరి పేరు, కానీ బాలయ్య సైలెంట్

    తెరపైకి పూరి పేరు, కానీ బాలయ్య సైలెంట్

    ఈ సినిమాకు పూరి దర్శకత్వం వహించే అవకాశం ఉందని, ఆయన ఇప్పటికే ఆ పనిలో ఉన్నారని, స్క్రిప్టు తుది మెరుగులు దిద్దుతున్నట్లు ప్రచారం మొదలైంది. అలాగే ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే బాలయ్య మాత్రం ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం ఎవ‌రు వ‌హిస్తార‌న్న విష‌యంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను నేనే చేస్తాను అన్నారు.

    తప్పకుండా ఉండే అంశాలు

    తప్పకుండా ఉండే అంశాలు

    ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ ఒక సాధారణ కుటుంబం నుండి సినిమాల్లోకి ఎలా వచ్చారు....ఎలా ఎదిగారు, ఆయన రాజకీయాల వైపు అడుగులు వేయడానికి కారణం ఏమిటి అనే విషయాలు తప్పకుండా చూపించే అవకాశం ఉంది.

    తెలుగు జాతి కోసం, ప్రజల కోసం చేసిన పనులు

    తెలుగు జాతి కోసం, ప్రజల కోసం చేసిన పనులు

    నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తెలుగు జాతి కోసం, ప్రజల బాగు కోసం చేసిన మంచి పనులను సినిమాలో తప్పకుండా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.

    వివాదాస్పద అంశాలు

    వివాదాస్పద అంశాలు

    అయితే వ్యక్తిగత ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్పద అంశం అంటే ఆయన లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకోవడం. ఆయన ఈ వివాహం చేసుకోవడం ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదనేది అప్పట్లో ఓ వాదన ఉండేది. మరి సినిమాలో లక్ష్మి పార్వతి అంశం ప్రస్తావనకు వస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

    రాజకీయ వివాదం, పదవి కోల్పోయిన అంశం

    రాజకీయ వివాదం, పదవి కోల్పోయిన అంశం

    ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా ఆయనపై అవిశ్వాస తీర్మాణం పెట్టి పదవి నుండి దించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని దాని వెనక ఉన్న పరిణామాలను సినిమాలో చూపిస్తారా? లేదా? అనేది ఆసక్తికరం.

    English summary
    A feature film on the life of Telugu idol late Nandamuri Taraka Rama Rao will soon be made, his son and actor Balakrishna announced. "It will be a biopic and will contain many unknown facets on the life of NTR," Balakrishna told reporters in his ancestral village Nimmakuru in Krishna district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X