twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మామూలుగా లేదుగా: బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ పోస్టర్ (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చేస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ విడుదల చేసారు. ఎగురుతున్న జెండా దానిపై గౌతమి పుత్ర శాతకర్ణి. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతున్న తరహాలో ఈ పోస్టర్ డిజైన్ ఉండటం విశేషం. ఆ పోస్టర్ ని మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు.

    ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం(22-04-2016) ఉదయం 10.27 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరుతూ చిత్ర యూవుట్ విభిన్నమైన ఆహ్వానపత్రికను పంపిణీ చేసింది.

    స్వయంగా గౌతమి పుత్ర శాతకర్ణి ఆహ్వానిస్తున్నట్లుగా దీనిని ముద్రించారు. చిత్ర యూనిట్ పేర్లన్నిటికీ కూడా శాతకర్ణి పేరులాగా తల్లి పేరు చేర్చి ముద్రించిన ఈ ఆహ్వానపత్రిక ఆకట్టుకుంటోంది.

    ముహూర్తం శుక్రవారం ఉదయం గం.10.27ని.లకి. స్థలం అన్నపూర్ణా స్టూడియోలో. శ్రీబసవరామ తారకపుత్ర నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం అంజనాపుత్ర రాధాకృష్ణ(క్రిష్‌) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, చిత్రపరిశ్రమ ప్రముఖులకు, పాత్రికేయులు తదితరులకు ఈ ఆహ్వానపత్రిలు అందించారు. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌రెడ్డి, శ్రీనివాస్‌, సాయిబాబులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ.... భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రింద పరిపాలించిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగు వారందరూ తెలుసుకోవాల్సిన గొప్ప చరిత్ర ఇది. నాన్నగారు ఈ పాత్ర చేయాలని భావించి ఆరు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారని తెలిసింది. ఆయన చేయలేకపోయిన పాత్ర నన్ను వరించడం అదృష్టంగా భావిస్తున్నాను. గౌతమీపుత్ర శాతకర్ణి శాంతి కోసం యుద్ధాలు చేశారు. ఛత్రపతి శివాజీతో సహా అనేకమంది రాజులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.

    స్లైఢ్ షోలో ఫస్ట్ పోస్టర్ మరియు ఆహ్వానపత్రం, బాలయ్య లుక్ వంటివి చూడండి...

    తొలి తెలుగు రాజు...

    తొలి తెలుగు రాజు...

    అఖండ భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను నందమూరి బాలకృష్ణ తన నూరవ చిత్రంలో పోషించబోతున్న సంగతి తెలిసిందే.

    అప్పట్లో...

    అప్పట్లో...

    మహానటుడు, నటరత్న ఎన్టీయార్‌ పోషించాలనుకున్న ఈ పాత్రను ఆయన సమయాభావం కారణంగా కార్యరూపంలోకి తీసుకురాలేకపోయారు.

    విశేషం..

    విశేషం..

    ఇప్పుడు తన తండ్రి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రంగా చేస్తుండటం విశేషం.

    ఉగాది రోజు..

    ఉగాది రోజు..

    ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ రాజధాని అమరావతిలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ గురించి బాలకృష్ణ ప్రకటించారు.

    ఓపినింగ్..

    ఓపినింగ్..

    ఈ నెల 22న హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది.

    వేలాదిగా..

    వేలాదిగా..

    సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా వేలాదిగా బాలకృష్ణ అభిమానులు ఈ ప్రారంభోత్సవానికి తరలిరాబోతున్నారు.

    అమరావతిని...

    అమరావతిని...

    కృష్ణానదీ తీరాన అమరావతిని, గోదావరి తీరంలోని కరీంనగర్‌ జిల్లా కోటిలింగాల పల్లిని, మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలోని ప్రతిష్ఠానపురంను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు గౌతమీపుత్ర శాతకర్ణి.

    ఫ్యాన్స్ పండుగ..

    ఫ్యాన్స్ పండుగ..

    ఈ అచ్చ తెలుగు చారిత్రకవీరుని జీవితాన్ని బాలకృష్ణ వందో చిత్రంగా చేస్తున్నారనే వార్త వెలువడగానే అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

    స్వీయ నిర్మాణమే..

    స్వీయ నిర్మాణమే..

    క్రిష్‌ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్‌ సమర్పణలో రాజీవ్‌రెడ్డి, సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    మరోసారి బాలయ్యకు

    మరోసారి బాలయ్యకు

    బాలకృష్ణ సినిమాకు మరోసారి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    The first look of ‘Gautamiputra Satakarni’ was released. This is Balakrishna’s 100th movie. Being directed by Krish and produced by Firstframe Entertainments, ‘Gautamiputra Satakarni’ begins regular shoot in May. The movie’s launch ceremony takes place on 22nd morning at Annapurna Studios in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X