twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లయన్’ సెన్సార్ పూర్తి: నిడివి ఎంత? రిలీజ్ డేట్ ప్రకటన

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలకృష్ణ తాజా చిత్రం ‘లయన్' భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు సత్య దేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణ రావు నిర్మించారు. ఈ చిత్రసెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్ర నిడివి 149 నిమిషాలు. అలాగే చిత్రం విడుదల తేదీని మే 8 గా నిర్మాతలు ఖరారు చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ''నాకు ఆటను వేటగా మార్చడానికి అరసెకను చాలు..'' అంటూ 'లయన్‌' చిత్రం కోసం ఉగ్రరూపం దాలుస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'లయన్‌'. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు. సత్యదేవా దర్శకత్వం వహించారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. మే 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Balakrishna's Lion Censor Report & Release Date

    మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటలకు వస్తున్న స్పందన పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ''భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తుంది... విని మారకపోతే చచ్చాక వినిపిస్తుంది. యుద్ధానికి ముందు వినిపించమంటావా, చచ్చాక వినిపించమంటావా'' అంటూ బాలకృష్ణ శక్తిమంతమైన సంభాషణలు పలికారు. ఇలాంటి పటాసుల్లాంటి డైలాగులు సినిమా నిండా ఉన్నాయట. ''బాలకృష్ణ రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠతను కలిగిస్తాయి'' అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రానికి సంభందించి ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లో బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ మొదటిసారి ఓ పాత్రలో సిబిఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ అంశాలతో సినీ అభిమానులని ఆకట్టుకోనుంది.

    బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

    English summary
    Balakrishna's mass entertainer 'Lion' obtained Censor clearance. Post the screening, Members awarded an 'U/A' Certificate for the movie. Immediately, Makers confirmed the release date as May 8th, 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X