» 

అందరూ రివ్యూలు బాగా రాశారు

Posted by:

Navadeep
హైదరాబాద్ : "అందరూ రివ్యూలు బాగా రాశారు. సర్వత్రా మా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు స్క్రీన్‌ప్లేను మెచ్చుకుంటున్నారు. దర్శకుడు అంతగా ఆకట్టుకున్నాడు'' అని నవదీప్ చెప్పారు. నవదీప్, కలర్స్ స్వాతి కాంబినేష్ లో రూపొందిన చిత్రం 'బంగారు కోడి పెట్ట'. బోణి ఫేమ్ రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసిన ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ని యూనిట్ నిర్వహించింది.

నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ... ''సినిమాని ఇన్ని రోజుల్లో చిత్రీకరించాలి.. ఇలా రూపొందించాలి అని ఎక్కడా రాసి లేదు. మేం ఎంతో మనసు పెట్టి చేసిన ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌ని జాగ్రత్తగా పరిశీలించి.. చక్కగా తీర్చిదిద్దుకొని విడుదల చేశాం. ఈ క్రమంలో కాస్త ఆలస్యమైంది. అయినా సినిమాకొస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని చూసినవారు పూర్తి సంతృప్తితో థియేటర్‌ నుంచి బయటకు వస్తున్నారు. మేం ఆశించింది ఇదే. మా బంగారు కోడిపెట్టను చూసిన వాళ్లందరూ బావుందని మెచ్చుకుంటున్నారు. 42 రోజుల్లో చిత్రీకరించిన ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆచితూచి ఫ్రేమ్‌లలో కూర్చాం'' అన్నారు .

హీరోయిన్ స్వాతి మాట్లాడుతూ... ''తెలుగులో వాణిజ్యపరమైన అంశాలతో.. అందరినీ అలరించే వినూత్నమైన చిత్రం చేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరింది. వైవిధ్యమైన చిత్రాలు రావాలని అందరూ అంటుంటారు. మా చిత్రం ఆ రీతిలోనే ఉంటుంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము''అన్నారు

రాజ్ పిప్పళ్ల మాట్లాడుతూ "కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జతపరుస్తూనే కొత్తదనంతో సినిమాను తెరకెక్కించాం. చక్కటి ఎమోషన్స్ ఉన్న సినిమా. ఫ్రెండ్స్‌తో రెండు గంటలు సరదాగా గడిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాను చూస్తే అలాంటి అనుభూతి కలుగుతుంది'' అని అన్నారు. సినిమాను ప్రోత్సహిస్తున్న వాళ్లందరికీ స్వాతి కృతజ్ఞతలు చెప్పారు.

అందరికీ ఓ బంగారు కోడిపెట్ట ఉంటుంది. దానితో ఆనందం,మనశ్సాంతి దొరుకుతుంది. దాని కోసం తట్ట, బుట్ట క్రింద వెతుకుతాం. ఈ సినిమాలో రియలైజ్ అయ్యేదేమిటంటే...బంగారు కోడిపెట్ట మన మనస్సులోనే ఉంది . సంక్రాంతి నేపథ్యంలో సాగే చిత్రమిది. మనిషి తన జీవితంలో రకరకాల అడ్డదారులను వెదుకుతుంటాడు. జీవితం మాత్రం తనదైన దారినే చూపెడుతుందన్న అంశాన్ని ఇందులో ఆసక్తికరంగా చెప్పారు. దొంగతనం, పేకాట, కోడి పుంజు అపహరణ, సినిమా ఆడిషన్స్‌ తదితర అంశాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతాయి

English summary
Navdeep, Swati starrer Bangaru Kodipetta released with hit talk. The film has been directed by Raj Pippalla, who had earlier made Sumanth starrer Boni. Sunita Thati has produced the film under Guru Films banner.

Telugu Photos

Go to : More Photos