twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెల్లంకొండ సురేష్ ఆఫీసు సీజ్,అవే దెబ్బకొట్టాయి

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఒక టైమ్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీని ఏలారు. అయితే కుమారుడుని లాంచ్ చేసిన తర్వాత ఆయన పరిస్ధితి మారిపోయింది. ఎంతలా అంటే... సురేష్‌ కార్యాలయాన్ని గురువారం కొటక్‌ మహీంద్రా బ్యాంకు అధికారులు సీజ్‌ చేశారు

    తమ వద్ద నుంచి తీసుకున్న రూ.11కోట్ల వరకు బ్యాంకు రుణం చెల్లించలేదని, అందుకే ఫిల్మ్ నగర్ లోని ఆయన ఆఫిస్ ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఇది ఊహించని దెబ్బే. గత కొంతకాలంగా ఇండస్ట్రీోల ఆయన తీసుకున్న ఫైనాన్స్ కు కూడా సెటిల్ మెంట్స్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    Bank seizes producer Bellamkonda's office

    బెల్లంకొండ సురేష్‌ తెలుగులో ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహా, గోలిమార్‌, ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను' సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పీడున్నోడు అనే మరో సినిమాలో కూడా శ్రీనివాస్ నటించాడు. అంతలోనే ఆయన తండ్రి, నిర్మాత సురేష్ కార్యాలయం సీజ్ కావడం గమనార్హం.

    అందుతున్న సమాచారం ప్రకారం ...అల్లుడు శ్రీను చిత్రాన్ని దాదాపు 30 కోట్లు వరకూ బడ్జెట్ పెట్టి తీసారు. ఆ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికి, కొత్త హీరో కావటంతో దాదాపు 15 కోట్లు వరకూ నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఆయన మిగతా సినమాల్లోనూ కొంత పోగొట్టుుకున్నట్లు చెప్తున్నారు.

    English summary
    producer Bellamkonda Suresh has also become loan defaulter. On Thursday (March 3rd), Kotak bank officials seized his office in Filmnagar in Hyderabad as he didn't repay the loan of Rs 11 Cr he took from the bank mortgaging his office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X