» 

బాపు సంతాప సభ ఫిల్మ్ చాంబర్ (ఫోటోస్)

Posted by:

హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు బాపు సంతాప సభను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ చాంబర్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు నటుడు కృష్ణ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, సినీ నిర్మాత డి రామానాయుడు, రాఘవేంద్రరావు, విజయనిర్మల, పరుచూరి బ్రదర్స్‌, జెమిని కిరణ్, హేమ, ఎన్వీ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, శివాజీ రాజా, జమున తదితర పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

బాపుగారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ బాపు సినీ రంగానికి అందించిన సేవలను గురించి కొనియాడారు.

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దర్శకుడు బాపు ఆదివారం చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 80 సంవత్సరాలు. మూడేళ్ల కిందట తన ప్రాణస్నేహితుడు రమణ లోకాన్ని వదిలి వెళ్లాక మానసికంగా బాపు ఒంటరివాడయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా శ్రీరామరాజ్యం.

రామానాయుడు

దర్శకుడు బాపు సంతాప సభలో నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నిర్మాత డి రామానాయుడు.

ప్రముఖలు

ఫిల్మ్ చాంబర్లో జరిగిన సంతాప సభకు పలువురు తెలుగు సినిమా ప్రముఖలు హాజరయ్యారు.

కృష్ణ

దర్శకుడు బాపు సంతాప సభలో నివాళులు అర్పిస్తున్న సీనియర్ నటుడు కృష్ణ.

విజయ నిర్మల

దర్శకుడు బాపు సంతాప సభలో నివాళులు అర్పిస్తున్న నటి, దర్శకురాలు విజయనిర్మల.

జమున

సీనియర్ నటి జమున బాపు సంతాప సభకు హాజరై నివాళులు అర్పించారు.

సెలబ్రిటీలు

బాపు సంతాప సభకు తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, రాఘవేంద్రరావు, జమున, రామానాయుడు, విజయ నిర్మల తదితరులు హాజరయ్యారు.

సంతాప సభలో

బాపు సంతాప సభలో పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు.

బాపు

తెలుగు సినిమా రంగంలో తన దర్శకత్వ శైలితో బాపు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

 

 

Topics: tollywood, bapu, టాలీవుడ్, బాపు
English summary
Bapu condolence meet held at jubilee hills, Film Chamber Hall on Wednesday (3rd Sep) evening.

Telugu Photos

Go to : More Photos