twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు బాపు జయంతి ఉత్సవాలు (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దివంగత దర్శకుడు బాపు జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 15 నుంచి హైదరాబాదు ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయన చిత్రాల ప్రదర్శన జరుగుతోంది. ఈ నెల 21 వరకు బాపు చిత్రాలను ప్రదర్శిస్తారు.

    నరసాపురంలో ఉత్సవాలు...
    బాపు జయంతి ఉత్సవాలు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సోమవారం అట్టహాసంగా జరిగాయ. ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నరసాపురంలో ఏర్పాటు చేసిన బాపు విగ్రహాన్ని మంత్రి పల్లె ఆవిష్కరించారు.

    ఏటా డిసెంబర్‌ 15వ తేదీన బాపు జయంత్యుత్సవాలను శాశ్వత అధికార కార్యక్రమంగా నిర్వహిస్తామని రఘునాథరెడ్డి అన్నారు. బాపుతో పోల్చుకోదగ్గ వ్యక్తులు తెలుగుగడ్డపై ఇక పుట్టబోరన్నారు. కార్టూనిస్టుగా ఆయన స్థానం నంబర్‌ వన్‌గా నిలుస్తుందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్మించే కళాక్షేత్రానికి బాపు, వెంకటరమణల పేరు పెడతామని డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు.

    స్లైడ్ షోలో ఫోటోలు....

    బాపు విగ్రహం

    బాపు విగ్రహం


    ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సమకూర్చిన నిధులతో నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు బాపు విగ్రహం ఏర్పాటుకు కృషిచేశారు.

    10 కె రన్

    10 కె రన్


    బాపు జయంతి సందర్భంగా నరసాపురంలో 2కె రన్ నిర్వహించారు.

    బాపు

    బాపు


    బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

    బాపు చిత్రకళ

    బాపు చిత్రకళ


    బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నాడు.

    అన్ని రంగాల్లో...

    అన్ని రంగాల్లో...


    కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి.

    సినిమాల్లోకి

    సినిమాల్లోకి


    1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నాడు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1976 లో వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసేవారికి కన్నుల పండుగ.

    బాపు జయంతి ఉత్సవాలు

    బాపు జయంతి ఉత్సవాలు


    నరసాపురంలో జరిగిన బాపు జయంతి ఉత్సవాల్లో క్రిష్ణం రాజు, పల్లె రఘునాథరెడ్డి, మండలి బుద్దప్రసాద్ తదితరులు.

    బాపు గురించి...

    బాపు గురించి...


    వేదికపై బాపు గురించి మాట్లాడుతున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

    క్రిష్ణం రాజుకు సన్మానం

    క్రిష్ణం రాజుకు సన్మానం


    బాపు జయంతి ఉత్సవాల్లో సభా వేదికపై క్రిష్ణం రాజుకు సన్మానం.

    పుస్తకం

    పుస్తకం


    బాపు గురంచిన వివరాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు.

    అభిమానులు...

    అభిమానులు...


    బాపు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అభిమానులు.

    English summary
    Check out photos: Bapu Jayanthi Celebrations at Narasapur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X