twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాపు చివరి రోజుల్లో ప్లాన్ చేసిన చిత్రం

    By Srikanya
    |

    హైదరాబాద్ : తన సినిమాలతో, కార్టూన్ లతో, చిత్రాలతో తెలుగువారిని కొన్ని తరాల సేపు ఉర్రూతలూగించి చెరగని ముద్రవేసిన 'బాపు' ఇక సెలవంటూ తన మిత్రుడు రమణను వెతుక్కుంటూ శాశ్వతంగా వెళ్లిపోయారు. అయితే ఆయన చివరి రోజుల్లో ఎస్.పి.బాలసుబ్రమణ్యం కుమారుడు చరణ్ తో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అది ఓ యానిమేషన్ ఎంటర్టైనర్. అందిన సమాచారం ప్రకారం స్టోరీ బోర్డ్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇక వాటిని యానిమేషన్ స్టూడియోస్ కి అందించటమే మిగలింది. అది జరగకుండానే ఆయన స్వర్గస్తులయ్యారు.

    ఇక మంగళవారం చెన్నైలో బాపు పార్ధివ దేహానికి సినీ, రాజకీయరంగ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. బాపు భౌతికకాయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నైలోని బిసెంట్‌ నగర్‌ విద్యుత్తు శ్మశానవాటికలో అంతిమ సంస్కారం నిర్వహించారు. ఆయన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బాపును అమితంగా అభిమానించే గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా పాడెను కొద్దిసేపు మోశారు. మరికొంతమంది అభిమానులు కూడా పాడెను మోశారు. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌, నిర్మాత బోనీకపూర్‌లు అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ శ్మశానవాటికలో ఉండిపోయారు.

    Bapu last film on animation missed

    బాపు పార్ధివ దేహానికి పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడి,్డ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌లు హాజరై బాపు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.

    తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య, సినీ నటులు మోహన్‌బాబు, రావికొండలరావు, గాయకుడు మనో, గీత రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల, పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌, నటి సంగీత, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, 'శ్రీరామరాజ్యం'లో లవకుశ, హనుమలుగా నటించిన బాలనటులు గౌరవ్‌, ధనుశ్‌, పవన్‌శ్రీరామ్‌, ఈటీవీ సీఈవో బాపినీడు తదితరులు బాపు మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    English summary
    Bapu deserted all leaving Tollywood in tears. His final film ‘Sri Rama Rajyam’ spellbound all. However Bapu planned another film with SP.Balasubramanyam's son Charan teaming which his son for an animation entertainer. The film's story board work is almost completed and when it required Bapu to take the story board to animation studios for graphics, Bapu passed away. Had Bapu completed this film, he would have set new trend in animation filmmaking.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X