twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తనపై దాడులు జరగలేదంటూ ఖండిస్తూ ప్రెస్ మీట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ‘నా ఆఫీస్ మీద ఎవరు దాడి చేయలేదు, అలాగే నా మీద ఎవరూదాడి చేయలేదు. బయట వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మీడియా వారు ఒక వార్త రాసే ముందు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని' ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    గత కొద్ది రోజులుగా మీడియాలో బెల్లంకొండ సురేష్ ఆఫీసు పైన, ఆయనపై కూడా దాడి జరిగిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం బెల్లంకొండ వాహనం ఒక యువకుడిని గుద్దడం, ఆ యువకుడు ప్రస్తుతం హాస్పిటల్ లో ఉండడం. కానీ తాజాగా బెల్లంకొండ తనపైన జరిగిన దాడిలో వాస్తవం లేదని అన్నాడు.ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చిరు బెల్లంకొండ సురేష్.

    Bellamkonda Suresh

    ఇక ఆయనపై దాడిజరిగిన న్యూస్ ఈ క్రింద విధంగా మీడియాలో వచ్చింది..

    నగరంలోని ఫిల్మ్‌నగర్‌ రోడ్‌నెంబర్‌ 7లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కారు ఓ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు బెల్లంకొండ ఆఫీస్‌పై దాడి చేశారు. అద్దాలు, ఫర్రీచర్‌ను ధ్వంసం చేశారు. బెల్లంకొండ సురేష్‌పైనా స్థానికులు దాడి చేశారు. సురేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. ఈ ప్రమాదానికి కారకులైన కారు డ్రైవర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

    బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం ‘గంగ(ముని 3)' సినిమాని రిలీజ్ చెయ్యాలనే పనిలో ఉన్నాడు. అన్నీ కుదిరితే గంగ సినిమా మే 1న రిలీజ్ అవుతుంది. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది.

    English summary
    Bellamkonda Suresh denied all those reports in a recent media interaction. He admitted that no one damaged his office and he was not manhandled by anyone. Bellamkonda further added that people should verify the facts before publishing these kinds of issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X