» 

మర్డర్‌ మిస్టరీ ("భద్రమ్'' ప్రివ్యూ)

Posted by:

హైదరాబాద్ : తమిళంలో హిట్టైన పెద్ద సినిమాలే గతంలో ఇక్కడ డబ్బింగ్ అయ్యేవి. అయితే ఇప్పుడు అక్కడ చిన్న సినిమాలు కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అదే కోవలంో తమిళంలో రూపొందిన 'తెగిడి' ని డబ్బింగ్ చేసి ఈ రోజు విడుదల చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యం ఉన్న సినిమా ఇది.

కథేమిటంటే... క్రిమినాలజీ పూర్తి చేసిన వేణు(అశోక్ సెల్వన్)కి రాడికల్ డిటెక్టివ్ సర్వీస్ లో డిటెక్టివ్ జాబు రావడంతో హైదరాబాద్ కి వచ్చి అమీర్ తో పాటు ఉంటాడు. వేణు కంపెనీ తనకు ఇచ్చిన ప్రతి కేసుని చాలా పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఫినిష్ చేస్తుంటాడు. అలా ఓ రోజు వేణు చేతికి మధు శ్రీ(జనని అయ్యర్) ఫెయిల్ వస్తుంది. వేణు తన గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె తో పరిచయం పెంచుకుంటాడు. వారిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.అప్పుడే వేణుకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఏమిటి దీని వెనక ఉన్న మిస్టరీ అనేది మిగతా కథ.

నిర్మాత జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ...తమిళంలో తెగిడి సినిమా చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌ అయింది. ఈ చిత్రానికి పాజిటివ్‌ రివ్యూలొచ్చాయి. ఫస్ట్‌ కైండ్‌ ఆఫ్‌ థ్రిల్లర్‌. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రానికి ఆర్‌.ఆర్‌.బాగా కుదిరింది. ఇదొక డిఫరెంట్‌ జోనర్‌. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అవుతుంది. తమిళంలో భారీ వసూళ్లు చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా చిత్రం అందుకుందని, భద్రమ్ చిత్రానికి 4/5 రేటింగ్ వచ్చిందని తెలిపారు. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగాసాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ అన్నారు.


సంస్థ: శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిం మేకర్స్
నటీనటులు: పిజ్జా ఫేమ్ అశోక్ సెల్వన్‌, జనని, జయప్రకాష్, కాళీ తదితరులు.
సమర్పణః బి.సుధాకర్ రెడ్డి.
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
సంగీతం: నివాస్ ప్రసన్న,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:పి.రమేష్.
నిర్మాతలుః బి.రామకృష్ణారెడ్డి,గుడ్ ఫ్రెండ్.

Read more about: bhadram, tamil dubbing, pizza, భధ్రమ్, తమిళ డబ్బింగ్, పిజ్జా
English summary
Bhadram is Telugu Version of Super hit Tamil film Thegidi. Vetri (Ashok Selvan) is a newly graduated criminology student who has an immense passion in becoming a detective. He gets a job with a detective agency and is assigned with the task of shadowing and surveillance. He does his job and collects all the details about his targets.
Please Wait while comments are loading...