Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున ‘భాయ్’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున నటిస్తున్న 'భాయ్' మూవీ ఆడియో అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 2వ వారంలో రిలీజ్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు నిర్మాతలు.
డమరుకం తర్వత నాగార్జున నటించిన సినిమాలేవీ రాక పోవడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, అజయ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు. నథాలియా 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు.
హైదరాబాద్లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా తీర్చి దిద్దిన సెట్లో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.