twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తణికెళ్ల భరణికు మరో ఎదురుదెబ్బ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మిధునం చిత్రం తర్వాత తణికెళ్ల భరణి దర్శకత్వంలో చిత్రం గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఏదీ మెటీరయలైజ్ కాలేదు. ఆ మధ్యన శర్వానంద్ తో అనుకున్న ఊరి చివరి గుడెసె ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత ఆయన సునీల్ తో భక్త కన్నప్ప అనుకున్నారు.

    కానీ రకరకాల చర్చలు, లెక్కలతో ఆ ప్రాజెక్టూ మెటీరియలైజ్ కాలేదు. ఇంతలో ఎంత బడ్జెట్ అయినా సరే అంటూ రంగలోకి మంచు విష్ణు దిగి, తన సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ పై నిర్మిస్తానని, అందులో హీరోగా తనే చేయ్యాలి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆఫీస్ తీసి, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. కాని ఇప్పుడు అది కూడా మిస్ అయిందని సమాచారం.

     Bhaktha Kannappa stoped by 24 factory

    విష్ణుతో అనుకున్న ఈ సినిమా ఆగిపోవాడానికి కారణం...ఇండస్ట్రీలో చెప్పుకునే దాని ప్రకారం నిన్నటి వరకు లోకల్ నిర్మణ సంస్థగా వున్న 24 ప్రేమ్స్, ఈ మధ్యే ఇంటర్నేషనల్ అయ్యింది. దానితో ఈ సినిమాకు ఇంటర్నేషనల్ స్థాయిలో తీయడానికి ఓ టీంని ఏర్పాటు చేసారు. ఆ టీం చెప్పిన మార్పులకు, భరణి ఆలోచనలకు పోంతన కుదరక పోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.

    ఏది ఎమైనా భారి బడ్జేట్ సినిమాగా రూపొందాల్సిన సినిమా క్రియేటివ్ డిఫెరెన్స్ లతో ఆగిపోవడం అభిమానులకు కొంత భాదగానే వుంటుంది. మరి ఇప్పుడు ఈ సినిమాను ఎవరి చేతుల్లోకి తీసుకుంటారో వేచి చూడాలి. వీటికి తోడు..కృష్ణరాజు గారు ..ప్రభాస్ తో భక్త కన్నప్ప రీమేక్ చేస్తానని చెప్తున్నారు.

    English summary
    Earlier they said 24 Frames Factory is teaming up with a Hollywood Production house for ‘Bhakta Kannappa’ movie. But now the project is reportedly shelved.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X