twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి-2' కొత్త పోస్టర్ లో పెద్ద మిస్టేక్..మీరు గమనించారా, ఇదే చర్చ అంతటా

    బాహుబలి 2 చిత్రం కోసం విడుదల చేసిన పోస్టర్ లో పెద్ద తప్పు ఉందని ప్రచారం మొదలైంది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి-2' ఫీవర్ క్రమంగా పెరుగుతూ పోతోంది. 'బాహుబలి' (ది బిగినింగ్) సస్పెన్స్‌తో ముగించడం...ఈ సస్పెన్స్‌కు బాహుబలి-2 (ది కంక్లూజన్)తో తెరదించనుండటంతో సహజంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకబికిన జరుగుతున్నాయి.

    రీసెంట్ గా రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఎస్ఎస్ రాజమౌళి ట్వీటర్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్, అనుష్క విల్లును సంధిస్తున్నట్టు ఉన్న ఫొటో తొలిచూపులోనే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమరేంద్ర బహుబలి, దేవసేనకు సంబంధించిన చిత్రమని, బాహుబలి2లో మోస్ట్ ఆర్టిస్టిక్ సీక్వెన్సెస్ అని రాజమౌళి భారీ అంచనాలు పెంచారు.

    గురువారం ఉదయమే తెలుగు, తమిళ చిత్రాలకు సంబంధించిన స్టిల్స్ ను ట్వీటర్‌లో పోస్ట్ చేసిన దగ్గరనుంచి అన్ని వైపుల నుంచీ మంచి స్పందన వచ్చింది. అయితే ఈ పోస్ట్రర్ ఓ పెద్ద తప్పు ఉందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వారు పట్టుకున్న తప్పు ని మీకు ఇక్కడ అందిస్తున్నాం. అది కరెక్టా కాదా మీరు క్రింద కామెంట్ల కాలంలో చెప్పండి.

    లెక్క ప్రకారం...

    లెక్క ప్రకారం...

    మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ పోస్టర్ లో ..ప్రభాస్ వెనకగా, అనుష్క ముందుగా ఉంది. అనుష్క చేతిలో మూడు బాణాలు, ఓ ధనుస్సు ఉంది. ప్రభాస్ ఆమె వెనక మూడు బాణాలు, ధనుస్సు పట్టుకుని ఉన్నారు. లెక్కప్రకారం ప్రభాస్... చేతిలో ఉన్న మూడు బాణాలు ...అనుష్క చేతిలో ఉన్న తెల్ల ధనుస్సు వెనుక నుంచి వెళ్లాలి. కానీ అలా జరగలేదు.

    అతికించిన బాణాలే అయినా

    అతికించిన బాణాలే అయినా

    ప్రభాస్...బాణాలు...మూడు...అనుష్క పట్టుకున్న ధనుస్సు మీదుగా వెళ్తున్నాయి. అది అసాద్యం అని నెట్ జనుల వాదన. ఇవి గ్రాఫిక్స్ లో అతికించిన బాణాలే అయినా కాస్తంత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కదా అని విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలకి రాజమౌళి.. ఎలాంటి సమాధానం ఇస్తాడో వేచి చూడాలి.

    సంచలనంగా..

    సంచలనంగా..

    ఇక భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చారిత్రక చిత్రం 'బాహుబలి-2' ఇటు పబ్లిసిటీలోనే కాదు, మార్కెటింగ్ పరంగానూ సంచలనాలకు కేంద్ర బిందువవుతోంది. ఈ చిత్రం తమిళ రైట్స్‌ పెద్దమొత్తానికి అమ్ముడుపోయినట్టు సమాచారం.

    గ్రీన్ ప్రొడక్షన్ వారు

    గ్రీన్ ప్రొడక్షన్ వారు

    థియేటర్ రిలీజ్ హక్కులను శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ హౌస్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ వర్గాల భోగట్టా. ఆసక్తికరంగా రజనీకాంత్ సినిమాలకు ఆఫర్ చేసే మొత్తం కంటే ఇది కొద్దిగా తక్కువే అయినా, తమిళంలో ఇతర అగ్రహీరోల సినిమాల రైట్స్‌కు ఆఫర్ చేసే మొత్తం కంటే ఎక్కువని, సదరు ప్రొడక్షన్ హౌస్ ఈ మేరకు బాహుబలి నిర్మాతలకు ఆఫర్ ఇచ్చి డీల్ 'సీల్' చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.

    అంత రేటుకే..

    అంత రేటుకే..

    'బాహుబలి-2' హిందీ శాటిలైట్ హక్కులను 'సోనీ నెట్ వర్క్' ఎగురేసుకుపోయింది. ఇందుకు గాను నిర్మాతలకు రూ.51 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక డబ్బింగ్ చిత్రానికి, అందులోనూ ఓ ప్రాంతీయ చిత్రాన్ని టీవీల్లో ప్రసారం చేసేందుకు ఇంతవరకూ ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే ప్రథమమని బాలీవుడ్ వర్గాల భోగట్టా.

    33 స్టూడియోల్లో..

    33 స్టూడియోల్లో..

    ''పదిహేను నెలలుగా అల్మోస్ట్‌ ఇండియాలోని మేజర్‌ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలలో 'బాహుబలి: ద కంక్లూజన్‌' విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 33 కంటే ఎక్కువ స్టూడియోలు 'బాహుబలి-2' నిర్మాణానంతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. మా అందరి లక్ష్యం ఒక్కటే... విడుదల దిశగా దూసుకువెళ్తున్నాం'' అని కమల్‌కణ్ణన్‌ పేర్కొన్నారు.

    రిపీట్ కాదు

    రిపీట్ కాదు

    ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్‌ 28న బాహుబలి 2 సినిమా విడుదల చేస్తారా? లేదా? అనే సందేహం కొందరిలో ఉంది. ఎందుకంటే... సకాలంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తి కాకపోవడంతో 'బాహుబలి' చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి విడుదల చేయలేకపోయారు.ఇప్పుడూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా? అనే సందేహం రావడం సహజమే! ఈ డౌట్‌లకు 'బాహుబలి-2' విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ కమల్‌కణ్ణన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

    ఆడియే తేదిని కూడా..

    ఆడియే తేదిని కూడా..

    బాహుబలి 2 సినిమా విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని గడువులోగా పని ముగించేందుకు ప్రపంచంలోని పేరెన్నిక గన్న స్టూడియోస్‌ వర్క్‌లో ఇన్‌వాల్వ్ అయినట్టు కమల్ కన్నన్ తెలిపారు. కాగా, 'బాహుబలి-2' చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి మూడోవారంలో విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ తేదీని కూడా ఫిబ్రవరిలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రకటించినట్టు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న 'బాహుబలి-2' విడుదలకు చిత్రయూనిట్ పట్టుదలగా ఉన్నట్లు చెప్తున్నారు.

    షూటింగ్ పూర్తి చేసుకున్న

    షూటింగ్ పూర్తి చేసుకున్న

    ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ముఖ్య పాత్రల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

    English summary
    Some netizens came up with a recognizable flaw in the Bahubali-2 poster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X