twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కుమారి 21ఎఫ్' నిషేధించమంటూ ఫిర్యాదు

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌ జంటగా కొత్త దర్శకుడు సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌' . ఈ చిత్రాన్ని తక్షణమే నిషేధించాలని హైదరాబాద్‌కు చెందిన రచయిత, సామాజిక కార్యకర్త బొగ్గుల శ్రీనివాస్ మానవహక్కుల కమిషన్‌కు (హెచ్చార్సీ)ఫిర్యాదు చేశారు.

    ఈ చిత్రంలోని ప్రతీ సన్నివేశం అమ్మాయిలను అవమానించే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మాత, రచయిత సుకుమార్, హీరో రాజ్‌తరుణ్, దర్శకుడు సూర్యప్రతాప్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    శ్రీనివాస్ ఫిర్యాదుపై స్పందించిన హెచ్చార్సీ చైర్మన్ ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. బొగ్గుల శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ పై 'పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' అనే పుస్తకం రాసిన సంగతి తెలిసిందే.

    Boggula Srinivas complaint on Kumari 21 F

    నవంబర్ 20న విడుదలైన ఈ చిత్రం విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించారు.

    ఓపినింగ్స్ కు భారీగా వచ్చిన ఈ చిత్రం యూత్ కు నచ్చేసి కలెక్షన్స్ వర్షం కురిపించింది. కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలతో సినిమా తెరకెక్కింది.

    English summary
    Boggula Srinivas lodge a complaint against the Kumari 21 F movie at State Human Rights Commission Hyderabad .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X