twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాభైలలోనూ ఇంత కష్టమా.. రియాలిటీ కోసం "ఖాన్ త్రయం" తాపత్రయం

    |

    హీరో అంటే ఒకప్పుడు కాస్త పొట్ట ఉన్నా.., ఏజ్ ఎక్కువ ఉన్నా పర్లేదనే అనుకునే వారు. గట్టిగా మేకప్ దట్టించి మెడవరకూ గుండీలు పెడితే సరిపోయేది. మిగిలిన పని కెమెరా మేన్ చూసుకుంటాడు. అయితే రానూ రానూ హీరోల బాద్యత పెరిగింది. కనీసం సిక్స్ ప్యాక్ ఉండాల్సిందే.., ఎక్కువగా డూప్ లమీద ఆధార పడకూడదూ అనే కాన్సెప్ట్ మొదలయ్యింది.

    దాంతో హీరోలంతా నటన మీదనే కాదు ఫిజికల్ ఫిట్ నెస్ మీద కూడా దృష్టి పెటారు... మామూలు గా కాస్త యంగ్ హీరోల సంగతి పర్లేదు కానీ యాభైలు దాటిన వాళ్ళైతేనే కష్తం... కానీ పర్ఫెక్షన్ కి పెద్ద పీట వేసే బాలీవుడ్ లో ఏజ్ సంగతి ఆలోచించలేదు ఖాన్ త్రయం...

    sharukh-ameer

    మొడటినుంచే కండల హీరో గా పేరున్న సల్మాన్ సంగతి సరేసరి.... అయితే అతని తోటి హీరో లైన అమీర్, షారూఖ్ లు కూడా లేటు వయసులో కండలు పెంచి మరీ యోధుల్లా తయారయ్యారు. ఇప్పటి తరం హీరోలకి ఏమాత్రం తగ్గ కుండా తామూ ఏమాత్రం తక్కువ తినలేదంతూ ప్యాక్ బాడీలని చొక్కాలు విప్పి చూపించారు. నిజానికి వాళ్ళ డేడికేషనే వాళ్ళని ఇంకా ఆ స్థాయిలో ఉంచింది. ఎందుకంటే బాలీవుడ్ టాలీవుడ్ లా కాదు అక్కడ నిలబడాలంటే ఖచ్చితంగా బయట ట్రెండ్ నీ, సినిమాల్లో కొంతైనా రియాలిటీనీ చూపించాలి

    ఇప్పుడు ఖాన్ లు ముగ్గురే కాదు మరో హీరో హృతిక్ కూడా తనని తాను ఒక గ్రీకు శిల్పం లా తీర్చి దిద్దుకున్నాడు. ఉడ్తా పంజాబ్ కోసం షాహిద్ కపూర్ కూడా సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరూ బయో పిక్ లమీద పడుతూందటం తో క్రీడా కారులూ, ఫైటర్ల పాత్రల కోసం కూడా ఈ ఫీట్ తప్పని సరి ఔతోంది. లేదంటే పాత్రలో రియాలిటీ దెబ్బతింటుంది మరి.

    తాజా గా సల్మాన్ చేస్తున్న "సుల్తాన్" సినిమా కోసం రెజ్లర్ లా కనిపించేందుకు ఇప్పటికే కండలతో ఉన్న బాడీని మరింత దృడంగా తయరు చేసడు. ఈ సినిమా కోసం అదనపు బరువుని కూడా పెరిగాడు. ఈ వయసులోనూ ముప్పైలలో ఉన్నప్పటి లుక్ కోసం చాలానే కష్ట పడుతున్నాడు. లేదంటే ప్రేక్షకులు ఒప్పుకోరు కదా... అందుకే ఇప్పటికే ఉన్న కందలని మరింత పొంగించి మల్ల యుద్ద యోదుడిగా మారాడు... రెజ్లింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

    సామాజిక అవగాహనతో, సామాజిక స్పృహ ఉన్న కేరక్టర్స్ చేయడం అమీర్ ఖాన్ కు ఇష్టం. జనాన్ని చైతన్యవంతం చేయడం అతని ఆశయం. అతను తీసిన సత్యమేవ జయతే ఇందుకు నిదర్శనం. అమీర్ ఖాన్ కూడా ...మహావీర్ పోగట్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమాలో తండ్రీ కొడుకు కేరక్టర్స్ వేస్తున్నాడు. ఒక కేరక్టర్ ...యువకుడిగా ఉన్న యోధుడి పాత్ర. ఈ సినిమా పేరు దంగల్. ఈ పాత్ర చేయడం కోసం అమీర్ ఖాన్ కండలు పెంచి... ఏకంగా 22 కేజీల బరువు పెరిగాడు.

    ఇక ఇప్పటి క్రేజీ హీరో... బాలీవుడ్ బాద్ షా ...షారుఖ్ ఖాన్. ఈ హీరో కు బిగ్ పర్సనాలిటీ లేదు. కానీ యాక్షన్ సూపర్బ్. అతని కళ్లు చూసి మనసు పారేసుకున్న అమ్మాయిలు కోకొల్లలు. సన్నగా, కాస్త పొట్టిగా, శారీరక దారుఢ్యం కాస్త తక్కువగా ఉన్నా చక్ దే ఇండియాలో హాకీ కోచ్ గా చేశాడు. ఆ పాత్రకోసం అతను కొన్ని నియమాలు పాటించాడు. కష్టపడి కసరత్తు చేశాడు. అయితే ఇప్పుదు షారూఖ్ కూడా ఇంకో యోదుడి పాత్రలో కనిపించే సినిమా కోసం పని మొదలు పెట్టాడత ఇక ఈయన కూడా బాడీని పెంచే పనిలో పడ్డాడు... ఈ డేడికేషనే వారిని ఈ వయసులో కూడా టాప్ నంబర్లలో నిలబెట్టింది.

    English summary
    Bollywood Top Heroes Salman, Shah rukh and Ameer Khan who crossed 50's caring about fitness and look.. now they are getting ready for new bio pics of real fighters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X