twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోస్టర్ల లోనే ఇంత బూతా? (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    ముంబై : ప్రేక్షకులని థియోటర్ కి రప్పించాలంటే దర్శక,నిర్మాతలు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు..అందులో భాగంగా టీజర్స్, పోస్టర్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. దాదాపు సినీ పరిశ్రమ పుట్టిన నాటి నుంచీ పోస్టర్స్ దే అగ్ర స్ధానం. తమ సినిమా ఏ జానర్ లో ఉండబోతోంది..ఆర్టిస్టులు ఎవరు..దర్శక,నిర్మాతలు ఎవరూ అనే అంశాలతో పోస్టర్స్ రెడీ చేసే వారు. ఇప్పుడు రోజులు మారాయి.

    ఇప్పుడున్న హీరోయిల్ని, వాళ్లు పడే ఆరాటాన్నీ చూస్తుంటే 'గ్లామరేషు హీరోయిన్‌..' అంటూ పోస్టర్ పైనే చూపించేస్తున్నారు. అ అందంగా కనిపించడం కోసమే పుట్టినట్టు, సినిమాకి గ్లామర్‌ అద్దితే తమ జన్మ ధన్యమై పోయినట్టు, బికినీ - టూపీసెస్‌ తమ జాతి జాతీయ జెండాలైనట్టు తపించిపోయే వాళ్లతో పోస్టర్స్ నింపేసి యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు.

    హీరోయిన్స్ కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని అర్దం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అందం హిమాలయాలనుంచి తీసుకొచ్చిన తీర్థం అన్నట్టు... తలా కాస్త పంచుతుంటారు. మొహమాటాన్ని స్టూడియో మెయిన్‌ గేట్‌ దగ్గర, 'నో' అనే పదాన్ని కార్‌వాన్‌లోనూ వదిలేసి సెట్‌కి వచ్చేస్తుంటారు. అందుకే ఎక్స్‌పోజింగ్‌ అనే మాటెత్తితే 'వై' అని ఎదురు ప్రశ్నించకుండా సహరిస్తున్నారు.

    అలా హాట్ హాట్ గా తయారైన రీసెంట్ పోస్టర్స్ లో కొన్ని...

    డైరీ ఆఫ్ ఎ బటర్ ప్లై

    డైరీ ఆఫ్ ఎ బటర్ ప్లై

    2012 లో వచ్చిన ఈ చిత్రం వినోద్ ముక్లీ డైరక్ట్ చేసారు. ఉదితా గోస్వామి ప్రధాన పాత్రలో చేసిన ఈ చేసిన ఈ చిత్రం తన పల్లె నుంచి సిటీ కి వచ్చిన ఓ అమ్మాయి కథ ఇది. కథలో మసాలా బాగానే దట్టించారు.

    నషా

    నషా

    ట్విట్టర్‌లో సెమీ న్యూడ్ ఫొటోల దగ్గరనుంచి, దాదాపు న్యూడిటీ ప్రదర్శించే ఫొటోలదాకా.. పూనమ్ పాండే చేసే హంగామా అంతా ఇంతా కాదు. ‘నషా' సినిమాతో నటిగా తెరంగేట్రం చేస్తున్న పూనమ్ పాండే తన అభిమానులకు అందాల విందు చేసింది.

     'మర్డర్‌ 2'

    'మర్డర్‌ 2'

    ఇమ్రాన్‌ హష్మి, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కాంబినేషన్ లో రూపొందిన 'మర్డర్‌ 2' డబ్బులు బాగానే సంపాదించి పెట్టింది. మల్లికా షెరావత్ హీరోయిన్ గా 2004లో వచ్చిన 'మర్డర్‌' చిత్రానకి ఇది సీక్వెల్. ముఖేష్‌ భట్‌ నిర్మించిన ఈ చిత్రానికి మోహిత్‌ సూరి దర్శకత్వం వహించారు. వరుస హత్యలు సాగిస్తున్న హంతకుణ్ని పట్టుకొనే అంశం ఈ కథలో కీలకం. అతడి హత్యలు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? అతని మానసిక స్థితి ఏమిటన్నది ఈ కథలో చూపించారు.

    ద డర్టీ బాలీవుడ్ బాచిలర్

    ద డర్టీ బాలీవుడ్ బాచిలర్

    ఓ వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తూంటారు. అయితే ఎప్పుడూ ఈ స్కీమ్ వర్కవుటు అవుతుందని చెప్పలేము. కొన్ని సార్లు బెడిసికొడుతుంది కూడా.

    జిస్మ్-2

    జిస్మ్-2

    నిజ జీవితంలో పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ జిస్మ్-2లోనూ నిజ జీవిత పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లలో సన్నీ లియోన్ అందాల ఆరబోత, ఘాటైన ముద్దు సన్ని వేశాలు, అర్ధనగ్న సీన్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. శృంగార ప్రియులంతా సినిమాలో తమకు కావాల్సిన మసాలా బాగానే ఉంటుందని ఆశ పడ్డారు. నీలి చిత్రాల తారకాబట్టి సినిమాలో శృంగారం పండించే సీన్లలో ఇరగదీస్తుంది భావించారు. కానీ పూర్తి నిరాశే మిగిల్చింది.

     దోనో వై

    దోనో వై

    ఇలాంటి చిత్రమైన కాంప్లిక్ట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించకపోయినా ఫిల్మ్ ఫెస్టివల్స్ గుర్తింపు తెచ్చుకుని నిర్మాతను నిలబెడుతున్నాయి.

    ఆషిక్ బనాయా అప్నే

    ఆషిక్ బనాయా అప్నే

    ఈ చిత్రం ఆడియో పరంగా సూపర్ హిట్. ఓ రకంగా ఈ చిత్రం హీరో ఇమ్రాన్ హష్మి కి సీరియల్ కిస్సర్ అవార్డు తెచ్చిపెట్టిందీ సినిమా.

    బిందీ బజార్

    బిందీ బజార్

    కొన్ని సినిమాలు... ఇవి పోస్టర్స్ స్ధాయిలోనే ఆగిపోతాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవటం మాట అటుంచి, వాటికి ఫైనాన్స్ చేసే ఫైనాన్సయర్స్ ని కూడా ఆకట్టుకోవు.

    హేట్ స్టోరీ

    హేట్ స్టోరీ

    సెక్స్ అండ్ క్రైమ్ తో నింపితేనే జనం చూస్తారని నమ్మి చేసిన చిత్రం ఇది. ఇది ఎంత సక్సెస్ అంటే సీక్వెల్ కోసం కూడా జనం ఎదురుచూసారు.

    ‘జిందగీ 50-50'

    ‘జిందగీ 50-50'

    బాలీవుడ్ హాట్ బాంబ్ వీణా మాలిక్ బాలీవుడ్లో నటించిన చిత్రం‘జిందగీ 50-50' . ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో ‘రంగీలా' పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు.

     బ్లడీ మనీ

    బ్లడీ మనీ

    కేవలం కలెక్షన్స్ పరమావధిగా తీసే ఈ చిత్రాలు బి,సి సెంటర్లను టార్గెట్ చేస్తూంటారు కాబట్టి..అక్కటి ప్రేక్షకులను ఆకట్టుకోవటానికే ఇలాంటి పోస్టర్స్ డిజైన్ చేస్తున్నామని చెప్తున్నారు.

    యూ ఈజ్ దేర్

    యూ ఈజ్ దేర్

    ఇలాంటి చిత్రం ఒకటి వచ్చిందని..బాలీవుడ్ ని రెగ్యలర్ గా అబ్జర్వ్ చేసేవారు కూడా చెప్పలేరు. అయితే ఇలాంటి సినిమాలు తమ బడ్జెట్ కు తగిన కలెక్షన్స్ సంపాదించి వెళ్లిపోతూంటాయి.

    ఒప్పుకుంటారా

    ఒప్పుకుంటారా

    హీరోయిన్స్ ఇలాంటి ..సినిమాల్లో చేయటానికి ఒప్పుకుంటారా...అని డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్ధితుల్లో అడిగిన డబ్బు ఇస్తే...అడిగిన దానికంటే అరముక్క ఎక్కువే చేస్తున్నారు.

     ఆశించకూడదు..

    ఆశించకూడదు..

    లిప్‌లాక్‌లు చూసే భాగ్యం దక్కుతోందంటే దానికి కారణం మన హీరోయిన్స్ అకుంఠిత దీక్ష.. దక్షతలే! మరి నటన అంటారా? ఇలాంటి సినిమాల్లో అది మనం అడక్కూడదు. వాళ్ల నుంచి ఆశించకూడదు. దయదలచి ఏదో ఓ సన్నివేశంలో నటించేసే ప్రయత్నం చేస్తే - చూస్తూ వారి తపనకు లోలోపల పొంగిపోవాలి అంతే.

    బిజినెస్ కోసమే

    బిజినెస్ కోసమే

    ఇలాంటి పోస్టర్స్ వల్ల ఎంతవరకూ ప్లస్ అవుతూందంటే..పోస్టర్ పడగానే కొందరు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బిజినెస్ ఎంక్వైరీలు వస్తాయని నిర్మాతలు చెప్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఇలాంటి చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉందని,వారినే టార్గెట్ చేస్తామని చెప్తున్నారు.

    English summary
    We take a look at some of the hottest movie posters to come out of bollywood over the last few years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X