twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    40 ఏళ్ల తర్వాత మన సినిమా పాకిస్థాన్లో రిలీజవుతోంది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ సినిమా చరిత్రలో ‘షోలే' చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రం 1975లో విడుదలై సంచలన విజయం సాధించింది. కొన్ని థియేటర్లలో ఈచిత్రం సంవత్సరాల కొద్దీ ప్రదర్శితం అయింది. తాజాగా ఈ చిత్రం పాకిస్థాన్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాకిస్థాన్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నదీమ్ మండ్వీవాలా ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 23న అక్కడ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఆ మధ్య 3డిలోకి కన్వర్ట్ చేసిన సంగతి తెలిసిందే.

    ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే. ఇప్పటి వరకు షోలేను తలదన్నే సినిమా రాలేదంటే అతిశయో‌‍క్తి కాదేమో. 40 ఏళ్ల కిందటే రూ. 3 వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్. రెండున్నర సంవత్సరాల ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు.

    Bollywood's iconic 'Sholay' to release in Pakistan

    తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది. షోలేను అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చినా ....అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం సినిమా ప్లస్సయింది. అంతుకే అప్పటికీ ఇప్పటికే...భారతీయ సినీ ప్రపంచంలో ది గ్రేట్ మూవీ ఓన్లీ 'షోలే" అంటుంటారు సీని ప్రేమికులు.

    English summary
    The cult classic "Sholay", an action adventure Bollywood movie circling around two petty thieves hired by a police officer to exact revenge on a ruthless bandit, is set to release in Pakistan, 40 years after hitting Indian theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X