twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరీ అంత నోటి దూల ఉంటే ఎవరేం చేస్తారు..? వివాదం లో బాలీవుడ్ గాయకుడు

    |

    నోటి దూల ఉంటే ఇలాగే ఉంటుంది.... డబ్బుందన్న గర్వం తో ఇష్టం వచ్చినట్టు నోరూ..., కీ బోర్డూ పారేసుకుంటే చిక్కులు తప్పవు. "ఫుట్ పాత్ లపై పడుకున్న కుక్కలు ప్రమాదంలో చనిపోతే కేసులు పెడతామా? ఫుట్ పాత్ లను నిద్రపోయేందుకు ఉపయోగిస్తారా? ఫుట్ పాత్ లపై ప్రమాదాలు జరిగితే డ్రైవర్లది తప్పుకాదు"... అంటూ ఒక సారి సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పడ్డఫ్ఫుడు ట్వీట్ చేసి ఒక సారి చిక్కుల్లో పడ్డా, మీడియాముందు క్షమాపణలు అడిగినా ఇంకా గాయకుడు అభిజిత్ భట్టాచార్య కి ఙ్ఞాన జ్యోతి వెలగనట్టే కనిపిస్తోంది.

    తాజాగా మరో వివాదం లో తలదూర్చాడు. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ పై అభ్యంతరకర ట్విట్ లు చేయటంతో ఆయనపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే చెన్నైలో ఇన్పోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యోదంతంపై గాయకుడు అభిజిత్ భట్టాచార్య వివాదాస్పదంగా ట్విట్ చేశారు. స్వాతి హత్యకు లవ్ జీహాదే కారణమని అతను తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

    అభిజిత్ భట్టాచార్య వ్యాఖ్యలపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ స్వాతి అభ్యంతరం వ్యక్తం చేశారు.హత్యకేసులో పోలీసులు రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసిన విషయాన్ని తెలుపుతూ జర్నలిస్ట్ రీట్వీట్‌ చేశారు. పాకిస్తానీ గాయకులపై ద్వేషంతోనే అభిజిత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడుతూ...

    జర్నలిస్ట్‌ను దూషిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీటర్‌ దాడిపై స్వాతి చతుర్వేది ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గాయకుడిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా లవ్ జిహాద్ అంటూ ట్వీట్ చేసిన అభిజిత్... తర్వాత నిజం తెల్సినా దాన్ని మతాల వపు మళ్ళించటమే కాక ఒక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టే లా మాట్లాడతం చూస్తూంటే... తొందరలోనే ఒక పార్టీ లో చేరబోతున్నాడనే వార్తల్లో నిజం ఉన్నట్టే ఉందీ...

    English summary
    Bollywood singer Abhijeet Bhattacharya created another controversy after he used ‘abusive’ language while addressing a woman journalist on Twitter on Sunday. Delhi Police registered a complaint against him after Swati Chaturvedi approached them
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X