twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంబరాలు: సల్మాన్‌ ఖాన్ జైలు శిక్ష నిలిపివేత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సల్మాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తూ బాంబే హైకోర్టు తీర్పు నిచ్చింది. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ కు బెయిల్ కూడా మంజూరు చేసారు. బెయిల్ కోసం పూచికత్తు కింద రూ. 30 వేల బాండు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.

    ఈ కేసు విచారణలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని భావిస్తున్నట్లు బాంబే హైకోర్టు న్యాయమర్తి థిప్సే న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అందుకే ఆయన బెయిల్ కు అర్హుడని వెల్లడించారు. అయితే సల్మాన్ ఖాన్ తీవ్రమైన నేరం చేసారని, కోర్టును తప్పుదారి పట్టించారని, ఆయనకు బెయిల్ ఇవ్వద్దంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను బాంబే హైకోర్టు జడ్జి పట్టించుకోలేదు.

    సల్మాన్ ఖాన్ బెయిల్ లభించడం, ఆయన ఇప్పట్లో జైలుకెళ్లే అవకాశం లేక పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు.

    Bombay High Court suspends Salman Khan's sentence

    అది కేవలం యాక్సిడెంటే అంటూ సల్మాన్ లాయన్ వాదన!

    సల్మాన్ తరుపు న్యాయవాది హరీష్ సాల్వే ఇతర కేసు వల్ల వీలు కాక పోవడంతో ఆయన తరుపున సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఆరోజు జరిగింది కేవలం యాక్సిడెంట్ మాత్రమే, మరణానికి కారణమయ్యాడనే అభియోగాలు సల్మాన్ మీద తొలగించాలి....సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలి అని అమిత్ దేశాయ్ జడ్జిని కోరారు. ఈ కేసులో సల్మాన్ తో పాటు కారులో ఉన్న కమాల్ ఖాన్ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదని అమిత్ దేశాయ్ వాదించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులున్నారు, వారంతా ప్రత్యక్ష సాక్షులే, దీనికి క్రింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని అమిత్ దేశాయ్ వాదించారు.

    ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తామని కోర్టు వ్యాఖ్యనించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెలుతోందని సాక్షి చెబుతున్నాడని, అయితే హోటల్ నుండి సంఘటన స్థలానికి 14 కిలోమీటర్ల దూరం మాత్రమే. కానీ 30 నిమిషాల సమయం పట్టింది. సల్మాన్ ఖానే కారు నడుపుతున్నట్లు ఎవరూ నిరూపించలేక పోయారని అమిత్ దేశాయ్ వాదించారు. పోలీసులు అధికారుల ఇచ్చిన సాక్ష్యాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు.

    కేసు వివరాలు...
    హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దేషిగా తేల్చింది. ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి డి.డబ్ల్యు దేశ్ పాండే తీర్పు వెలువరించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందు మరో రెండు నెలలు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారు. జడ్జి తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ ఖాన్ మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేదు. తలదించుకుని ఉన్నారు.

    కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో సెషన్స్ కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది.

    English summary
    2002 hit-and-run case: Bombay High Court suspends Salman Khan's sentence of the sessions court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X