twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఫ్యామిలీకే కాదు, సరైనోడు ఆ ముద్ర చెరిపేసింది: బోయపాటి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి దశాబ్ద కాలం దాటింది. 2005లో వచ్చిన 'భద్ర' చిత్రం ద్వారా దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఈ పదేళ్ల కాలంలో చేసినవి తాజాగా విడుదలైన 'సరైనోడు'తో కలిపి 6 సినిమాలు మాత్రమే. అయితేనేం..తనదైన యాక్షన్ మార్కు సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. బోయపాటి సినిమాల్లో హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆయన సినిమాలు చూసే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

    అయితే బోయపాటి మీద మాత్రం ఓ ముద్ర పడిపోయింది. బోయపాటి ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తారని, వారికి మాత్రమే అందుబాటులో ఉంటారనే ఓ రీమార్క్ ఉంది. ఈ విషయమై ఆయన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నేను వారితో సింహ, దమ్ము, లెజెండ్ మూడు సినిమాలు చేసాను. ఇవి నేను ఈ సినిమాలు చేయాలని ప్రత్యేకంగా ప్లాన్స్ ఏమీ వేసుకోలేదు. పరిస్థితులు అలా కలిసి రావడంలో చేసాను. నేను కూడా ఇలాంటి కంప్లయింట్స్ విన్నాను. నేను కొందరితో మాత్రమే చేస్తానని రిజర్వేషన్లే ఏమీ పెట్టకోలేదు. ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సినిమాలు చేస్తానని తెలిపారు. ఒక దర్శకుడిగా వివిధ స్టార్లతో పని చేస్తూ తన వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటానని తెలిపారు. నేను ఒకే ఫ్యామిలీ హీరోలకు పరిమితం అనే ముద్ర 'సరైనోడు' సినిమా ద్వారా చెరిగి పోయిందని భావిస్తున్నాను అని తెలిపారు.

    లెజెండ్ తర్వాత 2 సంవత్సరాల గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయమై కూడా బోయపాటి స్పందించారు. సాధారణంగా నేను ప్రతి సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటాను. వెంట వెంటనే సినిమాలు చేయను. ఒక సినిమా చేస్తున్నపుడు తర్వాతి సినిమా గురించి కూడా ఆలోచించను. నేను షూటింగులో ఉండగా చాలా మంది నా వద్దకు వచ్చి తర్వాతి సినిమా చేద్దామని అడుగుతుంటారు. అలాంటి సందర్బాల్లో జెంటిల్ గా వారి ప్రపోజల్స్ తిరస్కరిస్తుంటాను అని బోయపాటి తెలిపారు.

    లెజెండ్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాలని అనుకున్నాను. అయితే అది కుదరలేదు. తర్వాత సరైనోడు సినిమా కోసం ఆరు నెలలు వెయిట్ చేసాను. మొత్తం స్క్రిప్టు పూర్తయిన తర్వాతే సరైనోడు సినిమా మొదలు పెట్టాం. డబ్బుల కోసమో....బలవంతం మీదనో సినిమాలు చేయను అని బోయపాటి తేల్చ చెప్పారు.

    మీరు ఫైనాన్షియల్ గా సెట్ కాలేదని అంటుంటారు..నిజమేనా? అనే ప్రశ్నకు స్పందిస్తూ...'అవను..అది నిజమే. నేను ఇంకా ఫైనాన్షియల్ గా సెటిల్ కాలేదు. మాది జాయింట్ ఫ్యామిలీ. వారికి సపోర్టుగా ఉండాలి. నా జీవితంలో చాలా స్ట్రగుల్ అయ్యాను అని బోయపాటి చెప్పుకొచ్చారు.

    బన్నీ గురించి మాట్లాడుతూ... బన్నీ బాబు నాకు చాలా క్లోజ్. మేము ఎప్పుడు సినిమా చేయాలనుకుంటే అప్పుడు చేస్తాం. నా తొలి సినిమా భద్ర సమయంలో బన్నీ బాగా హెల్ప్ చేసాడు. ఆయన సహయాం నేను ఎప్పటికీ మరిచిపోలేను అని బోయపాటి తెలిపారు.

    ఈ రోజ బోయపాటి పుట్టినరోజు...ఆయనకు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

    బోయపాటి బర్త్ డే

    బోయపాటి బర్త్ డే

    బోయపాటి ఆఫీసులో పుట్టినరోజు వేడుకలు.

    దర్శకుడిగా దశాబ్దం

    దర్శకుడిగా దశాబ్దం

    2005లో వచ్చిన ‘భద్ర' చిత్రం ద్వారా దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఈ పదేళ్ల కాలంలో చేసినవి తాజాగా విడుదలైన ‘సరైనోడు'తో కలిపి 6 సినిమాలు మాత్రమే.

     సింహాతో...

    సింహాతో...

    సింహ చిత్రంతో బోయపాటి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు.

    సరైనోడు..

    సరైనోడు..

    ప్రస్తుతం బోయపాటి దర్శకత్వం వహించిన ‘సరైనోడు' విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది.

    English summary
    Boyapati Srinu turned one more year older today. And he says he has no big birthday resolutions. In a career spanning over decade, director Boyapati Sreenu might have directed only six films, including the latest Sarainodu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X