twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైంటిస్ట్ పాత్రలో నవ్వించనున్న బ్రహ్మానందం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ బేనర్లో భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఓ చక్కని విద్యా వైజ్ఞానిక చిత్రాన్ని తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘ఆదిత్య' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒయాసిస్ స్కూల్‌లో షూటింగ్ జరుగుతోంది.

    ఈ సందర్భంగా దర్శక నిర్మాత సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ...‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్నంత క్రేజ్ బ్రహ్మానందం గారికి మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి కాదు. కేవలం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఆయన హాస్యానికి నీరాజనాలు పడుతున్నారని తెలిపారు.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    అపుడు సచిన్, ఇపుడు బ్రహ్మీ

    అపుడు సచిన్, ఇపుడు బ్రహ్మీ


    ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో సచిన్ ఆడుతున్నాడా? ఔటయ్యాడా? అనే ప్రశ్నలు కోట్లాది అభిమానుల నుండి వచ్చేవి. ఇపుడు అదే స్థాయిలో తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం న్నాడా? లేడా? అని మరీ అడిగి సినిమాకు వెళుతున్నారు ప్రేక్షకులు అని వ్యాఖ్యానించారు నిర్మాత.

    బ్రహ్మీ స్టామినా

    బ్రహ్మీ స్టామినా


    బ్రహ్మానందంగారిని మా చిత్రంలో అద్భుతమైన సైంటిస్ట్ పాత్రలో నటించడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇటీవల జరిగిన ‘ఆగడు' చిత్రం ఆడియో ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు శంకర్ నేను బ్రహ్మానందంగారి వీరాభిమానిని అని చెప్పడంతో బ్రహ్మానందంగారి స్టామినా ఏమిటో అర్థమయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అన్నారు.

    ఆదిత్య సినిమా..

    ఆదిత్య సినిమా..


    అభ్యుదయవాదిగా సుమన్, ప్రిన్సిపల్ గా ఎమ్మెస్ నారాయణ మా చిత్రంలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు ఆడియో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాము. విద్యార్థుల అంతర్గత సంఘర్షణ, సృజనాత్మక శక్తిని గమనించి బాల్యదశలోనే విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంపొందిస్తే భవిష్యత్తులో వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే ఆశయంతో చిత్ర నిర్మాణం ప్రారంభించాం' అన్నారు.

    ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు


    బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో చాలా మంది బాలనటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుమన్, ఎం.ఎస్.నారాయణ, జబర్దస్త్ రాఘవ, పింకీ, జాకీ, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కందేటి శంకర్, ఆర్ట్: భాస్కర్, డాన్స్: స్వర్ణ, మరణ, ఎడిటింగ్: నందమూరి హరి, కథ-మాటలు-నిర్మాణం-దర్శకత్వం: సుధాకర్ గౌడ్ భీమగాని.

    English summary
    Brahmanandam play scientist role in Aditya movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X