twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందానికి వడదెబ్బ ...షూటింగ్ పోస్ట్ పోన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. జనం ఇళ్లలోంచి బయిటకు రావటానికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సినిమావాళ్లకు చాలా ఇబ్బందిగా మారాయి ఈ ఎండలు. వడదెబ్బ తగులతూండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సూర్య ప్రతాపానికి సినిమావాళ్లు అడపాదడపా అవుట్ డోర్ షూటింగ్ లలో అనారోగ్యం పాలవుతున్నారు.

    తాజాగా... టాలీవుడ్ టాప్ కమెడీయన్ బ్రహ్మానందంకు వడదెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితం వరకూ షూటింగ్‌ కోసం ఫారిన్‌లో ఉన్న బ్రహ్మాననంద...నిన్న హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చారు. అయితే ఎండ దెబ్బకు ఆయన కాస్త నీరసించారని సమాచారం. చేసేది లేక షూటింగ్ పోస్ట్‌పోన్ చేశారట. ప్రస్తుతం బ్రహ్మానందం కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Brahmanandam

    కెరీర్ విషయానికి వస్తే...

    కామెడీ కింగ్ బ్రహ్మానదం లేని తెలుగు పెద్ద సినిమా ఊహించలేని స్ధితికి వచ్చింది. ముఖ్యంగా కామెడీలు రాజ్యం ఏలుతున్న ఈ సమయంలో బ్రహ్మానందం రకరకాల గెటప్ లలో, పేర్లతో స్క్రీన్ పై నవ్వులు కురిపిస్తూ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిస్తున్నాడు. మొన్నామధ్య నాయక్ చిత్రంలో జిలేబిగా కనిపించి, తర్వాత కిల్ బిల్ పాండేగా రేసుగుర్రంలోనూ... రీసెంట్ గా అల్లుడు శ్రీను చిత్రంలో డింపుల్ గా కనిపించిన బ్రహ్మానందం ఆ మధ్యన లౌక్యం... ఇప్పుడు సిప్పీగా మరోసారి నవ్వించారు.

    ఈ సారి వీకెండ్ వెంకట్రావ్ గా రామ్ తాజా చిత్రం పండుగ చేస్కో లో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కామెడీతో ఇరగ తీస్తుందని చెప్తున్నారు. గతంలో రామ్, బ్రహ్మానందంల కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రతో మరో సారి తన ట్రేడ్ మార్క్ ని చూపించి సినిమాకు ప్లస్ అవనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 950కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన త్వరలో 1000 చిత్రాల మార్కును దాటబోతున్నారు.

    ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం ప్రత్యేకత. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

    English summary
    Brahmanandam who is currently in foreign locations returned back to Hyderabad. But Brahmi suffered sun stroke unable to bear the red hot son. Filmmakers postponed the shooting and Brahmi too is planning to take rest for some days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X