twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముదురుతున్న డీజే వివాదం.. హెచ్చార్సీకి బ్రహ్మణ సంఘాల ఫిర్యాదు

    దువ్వాడ జగన్నాథం చిత్ర నిర్వాహకులు, బ్రహ్మణ సంఘాల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. గుడిలో బడిలో మడిలో తమ కులాన్ని, మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి త

    By Rajababu
    |

    దువ్వాడ జగన్నాథం చిత్ర నిర్వాహకులు, బ్రహ్మణ సంఘాల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. గుడిలో బడిలో మడిలో తమ కులాన్ని, మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలోని అభ్యంతరకరమైన పదాలను తొలగించాలని వారు పట్టుబడుతున్నారు. ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు హరీష్ శంకర్.. ఆ పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరకపోవడంతో బుధవారం డీజే సినిమాపై మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)కు బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి.

    Brahmin represetatives met HRC on Duvvada Jagannadham row

    డీజే సినిమాలో అభ్యంతరకరమైన పాట, సన్నివేశాలున్నాయని బ్రాహ్మణసంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ సినిమాలో అభ్యంతరకర పాట, సీన్లు ఉంటే తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదుపై విచారణ జరిపించాలని సీఎస్, సినిమాటోగ్రఫీ, ప్రాంతీయ సెన్సార్‌బోర్డు కమిషనర్‌కు హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంపై ఈ నెల 19లోగా నివేదిక ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ నిర్దేశించింది.

    Brahmin represetatives met HRC on Duvvada Jagannadham row

    దర్శకుడు హరీష్ శంకర్ హమీ నెరవేరకపోవవడంతో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మంగళవారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కూడా కలిశారు. డీజే చిత్రానికి సంబంధించిన వివాదాన్ని మంత్రి తలసాని దృష్టికి తీసుకొచ్చారు. ఆ పాటలో అభ్యంతరకరంగా ఉన్న నమకం, చమకం అనే పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆ పాటలో పదాలు వాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

    Brahmin represetatives met HRC on Duvvada Jagannadham row

    English summary
    The song 'Gudilo Badilo Madilo Vodilo' of Duvvada Jagannadham in trouble again. This song is penned by Sahithi has not gone too well with the Brahmin associations in the region. Brahmin associations objecting to some of the lyrics in a recently released song from the film. Today Brahmin associations met Minster Talasani Srinivas and given complaint on this song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X