twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్రహ్మోత్సవం’ డైలాగులు లీక్: అదిరిపోయాయంతే...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం ‘శ్రీమంతుడు'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సాంగుతో పాటు కొన్ని సీన్లు చిత్రీకరించారు. ప్రస్తుతం ఊటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

    ఊటీలో షూటింగ్ డిసెంబర్ 13న మొదలైంది. డిసెంబర్ 22 వరకు ఇక్కడే షూటింగ్ జరుగబోతోంది. ఇక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు క్రిస్ మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ కు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసారు.

    కాగా ‘బ్రహ్మోత్సవం' మూవీలోని డైలాగులు లీక్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి. ఆ డైలాగులపై మీరూ ఓ లుక్కేయండి.

    'Brahmotsavam' Dialogues leaked

    -నలుగురిలో ఉండటం అంటే...నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండటం కాదు...నలుగురు నిన్ను గుర్తించడం.

    -మంచితనం నీ పుట్టుమచ్చ అయితే...దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు...ఏ మచ్చల కావాలో నువ్వే డిసైడ్ చేసుకో....

    -సమస్యలు అలల లాంటివి.... వస్తూఉంటాయి పోతూ ఉంటాయి. నువ్వు తీరంలాగా ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి.

    -సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గర డబ్బు ఎంత ఉన్నా ప్రయోజనం ఉండదు....

    -ఫ్యామిలీ ప్రాణం లాంటిది....జాగ్రత్తగా చూసుకోవాలి గానీ....ఎక్కడ పడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు.

    మహేష్ బాబు ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. కాజల్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా నేచురల్‌ సీన్స్‌తో సినిమాలు రూపొందించే శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రాన్ని కూడా అందర్నీ ఆకట్టుకునేలా చిత్రీకరిస్తున్నారు. నటనపై ఆసక్తి వున్న రియల్‌ ఫ్యామిలీస్‌ని ఈ చిత్రంలో నటించేందుకు ఆహ్వానిస్తోంది 'బ్రహ్మోత్సవం' టీమ్‌. వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా ఈ చిత్రంలో నటించేందుకు అర్హులు. ఆసక్తి వున్నవారు తమ ఫ్యామిలీకి సంబంధించిన రెండు ఫోటోలు, కాంటాక్ట్‌ డీటైల్స్‌ను [email protected] అనే మెయిల్‌ ఐడికి పంపించాల్సిందిగా పివిపి సినిమా టీమ్‌ కోరుతోంది.

    English summary
    The dialogues claiming to be of Brahmotsavam has been doing rounds on virtual world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X