'బ్రహ్మోత్సవం' : మహేష్ సరసన ముగ్గురు భామలూ వీళ్లే

By Srikanya

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ సినిమాలో మహేష్‌ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్ద ప్రెస్ నోట్ విడుజల చేసింది.

ఇక ఇటీవల లాంఛనంగా ఫ్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న 'బ్రహ్మోత్సవం' విడుదల చేయనున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు' షూటింగ్ పూర్తవడంతో మహేష్ బాబు ఇక తన దృష్టంతా బ్రహ్మోత్సవం సినిమాపై పెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉందీ చిత్రం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేయటంతో అభిమానులు ఆనందోత్సాహాలల్లో నిమగ్నమయ్యారు.

Brahmotsavam:Mahesh will be romancing three heroines

గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

శ్రీమంతుడు చిత్రం విషయానికి వస్తే....

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇంకా ఆడియో కూడా రిలీజ్ కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొందట. ఫైనల్‌గా ‘శ్రీమంతుడు' శాటిలైట్ రైట్స్‌ని సుమారు 10 కోట్ల రూపాయలకి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

Brahmotsavam:Mahesh will be romancing three heroines

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ మంతుడుకి సంబందించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాలోని నటీ నటుల డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వారిది ముగియగానే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేస్తారు.

మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు.

ఇక ఈ చిత్రంతో మహేష్‌బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్‌ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X