twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ ‘బ్రహ్మోత్సవం’ షో పడింది, ఇదిగో రివ్యూ రిపోర్ట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. మే 20న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ నటించిన ఈ చిత్రం విడుదల రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు థియేటర్స్ వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. థియేటర్స్ వద్ద అలంకరణ చూస్తుంటే మండు వేసవిలో సంక్రాంతి పండుగను తలపిస్తుంది.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం పబ్లిసిటీ విషయంలో పివిపి సంస్థ ఇంతకు ముందెన్నడూ లేనంత కేర్ తీసుకుంది. భారీ హోర్డింగ్స్, వినైల్స్ ఏర్పాటు చేసి 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చింది.

    సెన్సార్ రిపోర్ట్ కూడా క్లీన్ 'యు' రావడంతో శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబుకు మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా క్షణం, ఊపిరి చిత్రాలు తర్వాత పివిపి సినిమాకు హ్యాట్రిక్ హిట్ ఇస్తాడని అంటున్నారు. మే 20న తెలుగు సినిమా ప్రేక్షకులకు, సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

    అక్కడ షో పడింది, ఇదీ రిపోర్ట్...
    అయితే దుబాయ్ లో 'బ్రహ్మోత్సవం' సెన్సార్ షోను చూసిన ఉమర్ సంధు ఈ చిత్రానికి సంబందించిన రిపోర్ట్ తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ గా, ఇండియన్ మేగజైన్ ఎడిటర్ అని చెప్పుకునే ఉమర్ సంధు ఈ సినిమా సూపర్ హిట్టవుతుందని 5/5 రేటింగ్ ఇచ్చాడు.

    సినిమా చాలా బావుందని, మహేష్ బాబు గ్లామర్, సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ సినిమాను హై రేంజికి తీసుకెళ్లాయని, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు మహేష్ బాబుకు అవార్డులు కూడా తెచ్చి పెడుతుందని చెప్పారు.

    గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇతగాడు చెప్పాడు. కానీ అతను చెప్పింది రివర్స్ అయింది. సరైనోడు సినిమా విషయంలో అతడు చెప్పింది నిజమే అయింది. మరి 'బ్రహ్మోత్సవం' విషయంలో ఏమవుతుందో చూడాలి.

    స్లైడ్ షోలో మరిన్ని ఆసక్తికర విషయాలు...

    ఆ సీన్లు తొలగించారట

    ఆ సీన్లు తొలగించారట


    సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు. కానీ అసలు డ్యురేషన్ 2 గంటల 48 నిమిషాలు వచ్చిందట. కానీ ఇంత లెంగ్త్ అంటే బోర్ కొట్టేస్తుందని భావించిన మహేష్ దగ్గరుండి కొన్ని కత్తెరలు వేయించాడట. ముఖ్యంగా సెకండాఫ్ లో పలు కామెడీ సీన్లు తీసేయించారట.

    మూడో హీరోయిన్ ఎంపికలో ఇబ్బబంది

    మూడో హీరోయిన్ ఎంపికలో ఇబ్బబంది


    సమంత, ప్రణీత తర్వాత మరో ఎంపిక విషయంలో చాలా ఇబ్బంది వచ్చిందట. ఇప్పటికే ఇద్దరు ఉండటంతో మూడో హీరోయిన్ గా చేసేందుకు చాలా మంది టాప్ హీరోయిన్ల ముఖం చాటేసారట.

    మహేష్ షాక్

    మహేష్ షాక్


    కాజల్ రోల్ కు ఆమెకంటే ముందు చాలామందిని ట్రై చేశాం. సమంత ఉంది.. ఇంకో హీరోయిన్ కూడా ఉంది అనగానే.. వారు నో చెప్పేశారు. కథ వినకుండా రోల్ రిజక్టు చేయడం అనేది షాకింగ్ విషయం'' అని మహేష్ బాబు ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు.

    చెప్పుల యాడ్ కోసం కాదు

    చెప్పుల యాడ్ కోసం కాదు


    సినిమాకు చెప్పుల కంపెనీల యాడ్ సంపాదించడానికికే చెప్పులు తొడిగే సీన్ పెట్టారనే విమర్శలు వచ్చాయి. దీనిపై దర్శకుడు స్పందిస్తూ ''లేదండీ. ఎంతో ప్యూరిటీగా ఉంటే తప్ప ఇలాంటి విషయాలలో హీరో నటించలేరు. తండ్రి మీద ఉన్న ప్రేమను ఎక్సప్లెయిన్ చేయడానికి అలాంటి సన్నివేశాన్ని పెట్టాను' అన్నారు.

    English summary
    Superstar Mahesh Babu’s Brahmotsavam which is releasing worldwide this Friday is literally painting the town red. There is a festive atmosphere all over across all the theaters in the two Telugu states. The decorations at the theater give us a true Telugu festival vibe of Sankranthi in hot summer of May.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X