»   » ఫుల్ సెక్సీ 'టీజర్' : స్టార్ హీరోయిన్ .. ఐటం సాంగ్ (వీడియో)

ఫుల్ సెక్సీ 'టీజర్' : స్టార్ హీరోయిన్ .. ఐటం సాంగ్ (వీడియో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రదర్స్‌'. ఇందులో కరీనా కపూర్‌ ఖాన్‌ 'మేరా నామ్‌ మేరీ' అనే ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఈ పాట ఫస్ట్‌ లుక్‌ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఆ ఫస్ట్ లుక్ టీజర్ ని మీరూ చూడండి.

ఐటం సాంగ్ లో స్టార్ హీరోయిన్ ..ఇదీ బాలీవుడ్ నేర్పిన పాఠం. ఆ పాఠాన్ని ప్రతీ సినిమాలోనూ తూచ తప్పకుండా వినిపిస్తూ వస్తోంది బాలీవుడ్. తాజాగా కరీనా కపూర్ ఓ ఐటం సాంగ్ లో అదరకొట్టనుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కరీనాకపూర్ గతంలోనూ ... ఫెవికాల్‌సే లాంటి ఐటమ్‌ సాంగ్స్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మేరీ పాటతో బాలీవుడ్‌ ఇండస్ట్రీనే ఓ వూపువూపేసే పనిలో ఉంది. ఈ పాటకి కొరియోగ్రఫీ చేసిన గణేశ్‌ ఆచార్య దీనిని 2015 చికినీ చమేలీగా పేర్కొంటున్నారు.

'Brothers' Teaser: Kareena's Mera Naam Mary

ఈ చిత్రం 2011లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం 'వారియర్‌'కి రీమేక్‌. ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, అక్షయ్‌ కుమార్‌, జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా కలిసి నటించిన బ్రదర్స్‌ చిత్రంలో ఇద్దరూ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌ కీలకమైన పాత్రలో నటించారు. ముగ్గురూ ఈ చిత్రంలో చిరుగడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Kareena Kapoor's special song from 'Brothers' is now out. Upcoming “Brothers” movie, which happens to be a multi-starrrer featuring Akshay Kumar and Siddharh Malhotra in the leads, will see Kareena dancing as a Mary.
Please Wait while comments are loading...