» 

'ఎవడు' చిత్రంతో సంభంధం లేదంటూ దర్శకుడు

Posted by:

హైదరాబాద్ : రామ్ చరణ్ 'ఎవడు' సినిమాతో మా చిత్రానికి పోలిక పెడుతూ మాట్లాడుతున్నారు. ఆ చిత్రానికీ, 'బన్ని అండ్‌ చెర్రి'కి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు' అన్నారు దర్శకుడు రాజేష్ పులి. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బన్ని అండ్‌ చెర్రి'. ప్రిన్స్‌, మహత్‌ హీరోలుగా నటించారు. కృతి, సభా హీరోయిన్స్. హరూన్‌గని నిర్మాత. ఈ నెల 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ఒక సాంకేతిక అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ కథని అల్లుకొన్నాం. ఒకరి జీవితంలో జరిగిన సంఘటన మరొకరి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందో తెరపైనే చూడాలి. పాటలకు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభించింది. సినిమా కూడా అదే తరహాలో ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం మాకుంది. 'ఎవడు' సినిమాతో దీనికి పోలిక పెడుతూ మాట్లాడుతున్నారు. ఆ చిత్రానికీ, 'బన్ని అండ్‌ చెర్రి'కి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు'అన్నారు.

నిర్మాత హరూన్ గని మాట్లాడుతూ- ఒక మంచి కానె్సప్ట్‌కి సూపర్ కథనం దొరికితే ఎలా వుంటుందో మా 'బన్ని అండ్ చెర్రి' అలా వుంటుంది. ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాల దర్శకుడు మారుతి వద్ద కో డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్ పులి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు రాజేష్. తను చెప్పిన కథని చెప్పిన లోబడ్జెట్‌లో తీసి అందరినీ మెప్పించాడన్నారు. ఇండియన్ స్క్రీన్‌మీద ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెప్పుకుంటాం. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో జరిగిన ఓ పెనుమార్పు వారి జీవితాలను ఎలా తీసుకెళ్ళిందనేది ఎంటర్‌టైన్ చేస్తూ చూపించాం. ఆద్యంతం నవ్వించడమే ప్రధానంగా పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రానికి శ్రీవసంత్ సంగీతాన్ని అందించారన్నారు. హీరోలు ప్రిన్స్, మహత్‌లు ఇద్దరూ బాగా నటించారన్నారు. ఆడియో సూపర్‌హిట్ అయిందని తెలిపారు.

ప్రిన్స్, మహత్ రాఘవేంద్రలు హీరోలుగా, కృతి, సభా హీరోయిన్లుగా మల్టీ డైమన్షన్ సమర్పణలో రాజేష్ పులి దర్శకుడిగా హరూన్ గని ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత హరూన్ గని నిర్మిస్తున్న చిత్రం 'బన్ని అండ్ చెర్రి'. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్, బ్రహ్మానందం కీలక పాత్రలు చేస్తున్నారు. బ్రహ్మానందం, చంద్రమోహన్, సుమన్, ఎల్.బి.శ్రీరాం, జీవా, పోసాని కృష్ణమురళి, దువ్వాసి, మేల్కొటె, యండమూరి వీరేంద్రనాధ్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి రవికుమార్, తిరుమలశెట్టి కిరణ్, మోహన్ రామారావు, భాను, భాస్కరభట్ల, శ్రీమణి, కరుణాకర్, పోతుల రవికిరణ్, శ్రీవసంత్, ఎన్.సుధీర్‌రావు సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. నిర్మాత: హారూన్‌గని, దర్శకత్వం:రాజేష్ పులి.

Read more about: yevadu, bunny and cherry, dil raju, ఎవడు, బన్ని అండ్ చెర్రీ, దిల్ రాజు
English summary
Prince and Mahat will be seen in Rajesh Puli's upcoming film 'Bunny and Cherry'. The film has been cleared by the Censor board with U/A rating and is slated to hit the screens on December 14, 2013. Produced by Haroon Gani, it is the directorial debut of Rajesh Puli and has Kriti and Saba in special roles. Since the first look of the film is out, there is much buzz about it as it seems an engaging science-fiction drama. The film also stars Brahmanandam, Suman, Posani, LB Sriram, Chandra Mohan, Sita, SVR and Melkote.
Please Wait while comments are loading...