twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత ఊరే సన్నీ ని వెలేసింది... "కర‌ణ్‌జిత్‌ కౌర్‌ వోహ్రా" కీ సన్నీ లియోన్ కీ సంబందం ఏమిటి...?

    |

    ఎవరైనా తమ సొంతవూరు నుండి బయటకు పోయే మంచి పేరు తెచ్చుకుంటేనో, లేదా ఓ పెద్ద స్టార్ అయితేనో ఆ ఊరి వాళ్ళు వారి గురించి మాట్లాడుకోవడం , లేదా చిన్న పిల్లలకు చెప్పడం చేస్తుంటారు.కానీ ఈ హీరోయిన్ ను మాత్రం ఆ ఊరి వాళ్ళు తిట్టడం మొదలు పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్.

    బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత సన్నీ లియోన్‌ ఇమేజ్‌ మారిపోయింది. నటిగా విజయం సాధించిన ఆమె మోస్ట్‌ ఫేమస్‌ ఇండియన్‌-కెనడియన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. నెమ్మదిగా ఆమె మీద ఉన్న పాత పోర్న్ స్టార్ ముద్ర కూడా మర్చిపోతున్నారు జనం. అయితే ఆమెని ఒక మామూలు నటి గా ఇటు భారత్‌లో, అటు కెనడాలో ఆమెను అంగీకరిస్తున్నప్పటికీ.. సొంతూరిలో మాత్రం ఆమె పట్ల విముఖత వ్యక్తమవుతోంది. ఆమె గురించి మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకురావడం లేదు. ఆమెపై ఒక రకమైన సాంఘిక బహిష్కరణ భావం అక్కడ వ్యక్తమవుతుండటం విచార కరం.

    అంతర్జాతీయంగా ఎంత పేరు వచ్చినప్పటికీ పాపం ఆమె సొంతూరిలో మాత్రం ఆమె పట్ల విముఖత వ్యక్తమవుతోంది. ఆమె గురించి మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకురావడం లేదు. ఈ బ్యూటీ జీవితంపై 'మోస్ట్‌లీ సన్నీ' పేరిట ఓ డాక్యుమెంట‌రీ తీశారు. ఇందులో ఆమె గురించి మాట్లాడేందుకు సొంతూరు వాసులు ఒక్కరూ ముందుకురాలేదు. కెనడా ఒంటారియో ప్రావిన్స్‌లోని సార్నియా పట్టణంలో సన్నీ 35 ఏళ్ల కిందట జన్మించింది. ఆమె అసలు పేరు కర‌ణ్‌జిత్‌ కౌర్‌ వోహ్రా. సంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టినా

    canada sarnia people didn't accept sunny leone

    ప‌రిస్థితుల ప్ర‌భావంతో పోర్న్‌స్టార్‌గా మారింది. ఆమె గురించి ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ దిలీప్‌ మెహతా రూపొందించిన ఈ డాక్యుమెంటరీని తాజాగా టోరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. దేశ‌విదేశాల్లో ఎంత పేరు సంపాదించుకున్నా, సార్నియాలోని భారత సంతతి కెనడియన్లు మాత్రం స‌న్నీ పేరు ఎత్తితే చిరాకు పడుతున్నారు. ఈ డాక్యుమెంట్‌లో ఆమె గురించి మాట్లాడటానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదని, ఆమెను వారు ఏమాత్రం అంగీకరించడం లేదని ఫిల్మ్ మేకర్‌ దిలీప్ తెలిపారు.

    శృంగార చిత్రాల నుండీ నుండి బాలీవుడ్ వరకూ ఈమె ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కెనడాలో భారతీయ సంతతికి జన్మించిన ఈమె మొదట నీలి పరిశ్రమలోకి వెళ్లి నెమ్మదిగా భారత్ కు వచ్చి బాలీవుడ్ వైపుకు అడుగులు వేసింది. తొలుత ఈమె రాకను బాలీవుడ్ జనాలు ఒప్పుకోలేదు. కానీ కాలక్రమేణా ఆమెను అంగీకరించారు. దీంతో ఆమె పెద్ద స్టార్ గా ఎదిగింది. సాధారన ప్రేక్షకులు కూడా సన్నీ పట్ల అభిమానం పెంచుకున్నారు. మరోవైపు కెనడాలో కూడా ఆమెను ఆదరిసున్నారు. కానీ పుట్టిన సొంతూరు కెనడియన్‌ ఒంటారియో ప్రావిన్స్‌లోని సార్నియా పట్టణంలోని జనాలు మాత్రం ఆమెను అంగీకరించడం లేదు. పైగా ఆమె ఈపేరు ఎత్తితే కస్సుమంటున్నారు. ఒకరకంగా చెప్పాలనే ఆమెను అక్కడ బహిష్కరించినట్టే ప్రవర్తిస్తున్నారు ...

    English summary
    Actress Sunny Leone has become one of the most famous Indo-Canadians after her success in Bollywood but she remains a deeply divisive figure in her hometown, where many refused to even talk about her for a new documentary film on her life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X