twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొదటి దెబ్బ ఒట్టావా‌లో: బాహుబలి-2‌కి ఎదురు దెబ్బ ఓవర్సీస్‌లొనే పడింది

    బాహుబలి 2 ని భారీ ఎత్తున డబ్బులు పెట్టి హక్కులు కొన్నారు కాబట్టి అదే స్థాయిలో వసూళ్ళూ ఉండాలి కాబట్తి ఒక్కో టికెట్ ను 30 డాలర్లకు పైగా రేట్ పెట్టి అమ్మాలని చూసారట.

    |

    భారీ అంచనాల మధ్య బాహుబలి2 సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. బాహుబలి2 సినీ నిర్మాతల అభ్యర్థన మేరకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు షోల సంఖ్యను పెంచాయి. అయితే తెలంగాణలో ఈ సినిమా బెన్‌ఫిట్ షో ప్రదర్శనపై సస్పెన్స్ కొనసాగుతోంది. అది పక్కన పెడితే ప్రీమియర్ షోలకి కూడా పిచ్చ కాంపిటీషన్, వేల రూపాయలు పోసి మరీ టికెట్లు కొంటున్నారు... ఇదంతా ఇక్కడి పరిస్థితి ఇక ఓవర్సీస్ లెక్కలే వేరుగా ఉన్నాయి. అక్కడ మాత్రం ఇష్టం వచ్చిన రేట్లు పెడితే అసలు సినిమా చూమకుండానే ఉంటాం అని హెచ్చరించి మరీ టికెట్ రేట్లని దారికి తెచ్చారు.

    ఒక రోజు ముందే

    ఒక రోజు ముందే

    బెనిఫిట్ షో పుణ్యమా అని ఇక్కడ ఒక రోజు ముందే సినిమా వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందే రిలీజ్ చేసేస్తుండటం విశేషం. మామూలుగా ముందు రోజు అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షో వేయటం ఎప్పటినుంచో ఉన్నదే. ఐతే ఈసారి మత్రం ఆ సాంప్రదాయాన్ని తూచ్ అనేసారు.

    అనధికారిక ఫ్యాన్స్ షోల బదులు

    అనధికారిక ఫ్యాన్స్ షోల బదులు

    రెండు రాష్ట్రాల్లోనూ అసలు బెనిఫిట్ షో అన్నమాటే లేకుండా చేయటం‌తో ఈ అనధికారిక ఫ్యాన్స్ షోలకు బదులు అధికారికంగానే ఈ చిత్రాన్ని ముందు రోజు రాత్రి నుంచే ప్రదర్శిస్తే తప్పేమిటీ అనుకుని అదే మొదలెట్టేశారు... సో..! బాహుబలి రిలీజ్ డేట్ కన్నా ముందే రిలీజ్ అయిపోతున్నాడు... ఈ సంగతి అలా ఉంచితే ఓవర్సీస్ లో మాత్రం మాంచి పంచ్ పడినట్టే ఉంది... బాహుబలి క్రేజ్ ని దృష్తిలో పెట్టుకొని పెద్ద ఎత్తున లాభాలు ఆశించిన డిస్ట్రిబ్యూటర్లకు గట్టి షాకే తగిలిందక్కడ...

    100 కోట్లు వసూలు చేస్తే తప్ప

    100 కోట్లు వసూలు చేస్తే తప్ప

    బాహుబలి పార్ట్ వన్ సాధించిన విజయాన్ని బేస్ చేసుకుని.. ఆ సినిమా సాధించిన వసూళ్లను దాటిపోయిన రెట్లకు బాహుబలి2 రైట్స్ అమ్మేసారు, కొన్నవాళ్ళుక్కూడా అదే ఆశతో కొనేసారు. అదీ ఏరేంజ్ లో అమ్మారో తెలుఇసా? ఒక్క అమెరికాలోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తే తప్ప ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు కాదట.

    ఒక్కో టికెట్ 30 డాలర్లకు పైగా

    ఒక్కో టికెట్ 30 డాలర్లకు పైగా

    అంటే ఇక మీరే ఊహించండి ఏస్థాయిలో ప్లాన్ వేసారో. అయితే అంతా సవ్యంగా జరిగిపోతే బాగానే ఉండేది. కానీ వీళ్ళ టికెట్ రేట్లని చూసిన ప్రేక్షకులు ఒక నిర్ణయం మీద నిలబడి... గట్టి దెబ్బ కొట్టారు ఇంతకీ ఆ కథ ఏమిటంటే.... భారీ ఎత్తున డబ్బులు పెట్టి హక్కులు కొన్నారు కాబట్టి అదే స్థాయిలో వసూళ్ళూ ఉండాలి కాబట్తి ఒక్కో టికెట్ ను 30 డాలర్లకు పైగా రేట్ పెట్టి అమ్మాలని చూసారట.

    బాయ్ కాట్ చేసారు

    బాయ్ కాట్ చేసారు

    అయితే అందరూ మన టైప్ కాదు కదా కెనడా వాసులు షాక్ ఇచ్చారు. అధిక ధరల కారణంగా ఒట్టావా తెలుగు కమ్యూనిటీ జనాలు బాహుబలి2 సినిమాని అసలు మేము చూడటానికి సుముఖంగా లేమని చెప్తూ ఏకంగా బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పడంతో.. ఒక్క సారి వెన్నులో వణుకొచ్చింది డిస్ట్రిబ్యూటర్లకి ఆదెబ్బకి ఇప్పుడు లోకల్ డిస్ట్రిబ్యూటరూ, దాంతో పాటే ఎక్కువ ధరలూ దిగిరాక తప్పలేదు ఇప్పుడు తగ్గిన రేట్ల ప్రకారం 12.25 యూఎస్ డాలర్లకే బాహుబలి2 ని విక్రయిస్తున్నారు.

    10 డాలర్ల లోపే

    10 డాలర్ల లోపే

    జనరల్ గా అయితే అక్కడ బ్లాక్ బస్టర్ స్థాయి బాలీవుడ్ సినిమా అయినా, అక్కడే తీసిన హాలీవుడ్ సినిమా అయినా టికెట్లు 10 డాలర్ల లోపే ఉంటాయి. ఊరంతా ఒకదారైతే మన తెలుగు నిర్మాతలది లాభాల దారి అన్నట్టు , అక్కడ ప్రవాసం లో ఉన్న తెలుగు జనాలకు మన సినిమాల పై ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు టికెట్ల రేట్లు ఎంతపడితే అంతకు అమ్మటం కామన్ గా మారిపోయింది. ఇప్పుడీ "ఒట్టావా" దెబ్బకి బాహుబలి కూడా దిగిరాక తప్పలేదు... మరి ఇదే ఇన్స్పిరేషన్ గా మిగతావాళ్ళూ తీసుకుంటే...?????

    English summary
    This is one community that rallied around superbly to put paid to a distributor’s greedy plans. The OTA (Ottawa Telugu Association) gave the local distributor a befitting lesson. He was forced to cut down prices from $30 to the normal $ 12 per ticket.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X