twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశాన్పి కించపరిచారంటూ... పవన్ కళ్యాణ్ పై జాతి ద్రోహం కేసు

    జాతీయ గీతం ఆలపించాలని సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఆయనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ :పవన కళ్యాణ్ పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.సినిమా దియేటర్లలో జాతీయ గీతం ఆలపించాలని సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఆయనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.సుప్రిం తీర్పును పవన్ అవమానించారని హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ ఆరోపిస్తున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే...ట్విట్ట‌ర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తూ బీజేపీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తోన్నారు జ‌న‌సేనాని, సినీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే విషయం సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసిన ఆదేశాల ఆధారంగా సినిమా థియేటర్లలో జాతీయ గీతం ఆలపించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కుటుంబం స్నేహితులతో కలిసి సినిమా చూడటం దేశభక్తికి పరీక్షా వేదికగా కావొద్దని పవన్ తన ట్వీట్లలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

    Case booked against Pawan Kalyan in police station

    సినిమా హాళ్ల లో జాతీయ గీతం పాడడం ఫై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జాతి ద్రోహం కింద కేసు పెట్టాలని సరూర్ నగర్ పోలీసులకు సుంకరి జనార్దన్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. భారత దేశాన్ని కించపర్చేలా పవన్ వ్యవహరించారని పేర్కొంటూ జాతి ద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు దారుడు కోరారు. ఉన్నతాధికారుల సలహా మేరకు తగు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    కాగా పవన్ తన ట్వీట్లలో దేశభక్తికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని గౌరవించడంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొంటూ ఆయా పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయవద్దని పవన్ సూచించారు.

    థియేటర్ల జాతీయ గీతాన్ని గౌరవించడం పరీక్ష కావద్దని కోరారు. రాజకీయ పార్టీలు సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించవని ప్రశ్నించారు. చట్టాలను చేసేవారు వాటి గురించి ప్రచారం చేసేవారు.. వారెందుకు ఆచరించరు? ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలవొచ్చు కదా.. అని పవన్ సూటిగా నిలదీశారు. ఈ సందర్భంగా పార్టీలన్నింటిపై పవన్ సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.

    English summary
    The case was filed by High Court advocate Janardhan Goud deploring that Pawan Kayan has insulted the national anthem in his Twitter account. He alleged that the film actor is provoking people with anti-National Anthem campaign and also resorting to anti-national activities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X