twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాంటిక్ ఫిజిక్ కాబట్టే...: కేథరిన్‌ (హాట్ ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ఓ అమ్మాయిగా నటించిన కేథరిన్‌ అసలు పేరు కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌. 2010 లోనే కెరీర్‌ ఆరంభించిన ఈ కేరళ కుట్టి... ఈ ఏడాది ప్రథమార్ధంలో వరుణ్‌సందేశ్‌తో కలిసి 'చమ్మక్‌ చల్లో' అంటూ తెలుగు తెరపై తళుక్కున మెరిసింది. తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకున్న ఈ జవ్వనికి ఆ సినిమా రిలీజ్‌ అవ్వడం ఆలస్యం రెండు భారీ ఆఫర్లు మూటగట్టుకుని తెలుగు ప్రేక్షకులను తన హాట్‌ అందాలతో కవ్వించడానికి సిద్ధమవుతోంది.

    ఇప్పటివరకు ఒకే ఒ తెలుగు సినిమాలో నటించిన తారకు ఒకేసారి రెండు భారీ చిత్రాలలో అవకాశాలు లభించడమంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. బన్నీతో కలిసి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలోనూ, నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా' చిత్రంలోనూ, చిత్రంలో నాయిక గా నటించిన కేథరిన్‌ పంట పండిందని అంటు న్నారు.

    కన్నడ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికి ఇంతకుముందు కేవలం ఒకే ఒక చిత్రం (వరుణ్‌సందేశ్‌ సరసన 'చమ్మక్‌ చల్లో') లో నటించింది.'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో బన్నీతో కలిసి కేథరిన్‌ 'టాపు లేచిపోద్ది' పాటలో హాట్‌ హాట్‌గా నటించి అందరి దృష్టిలో పడింది. ఇప్పటికే సినివర్గాల్లో చర్చ మొదలయ్యింది.

    తొలుత కన్న డ, ఆ తరువాత మలయాళం, ఇప్పుడు తెలుగు సినిమాలో వన్‌ బై వన్‌ అరంగేట్రం చేసుకుంటూ పోతున్న అందాల తార కేథరిన్‌ తన మనస్సులో మాటలను మీడియా ముందు బయిటపెట్టింది.

    ఆమె ఇంటర్వూలో కొన్ని భాగాలు... స్లైడ్ షోలో ...

    దుబాయిలోనే ....

    దుబాయిలోనే ....

    నేను పుట్టింది కేరళలోని కొట్టాయంలో. నాన్న వ్యాపారరీత్యా నా చిన్నప్పుడే దుబాయ్‌ వెళ్లిపోయాం. ప్లస్‌టూ వరకూ దుబాయ్‌లోనే ఉన్నా. డిగ్రీ చదవడానికి బెంగళూరులో అడుగుపెట్టా. అక్కడ సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో చదువుతూనే మోడలింగ్‌లో నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని నా ఫొటోలు కొన్ని ప్రకటనల కంపెనీలకు పంపించాను.

    ప్రకటనలతో గుర్తింపు...

    ప్రకటనలతో గుర్తింపు...

    నా ఫొటోల్ని ప్రముఖ ఫ్యాషన్‌ గురు ప్రసాద్‌ బిద్దప్ప చూసి ఆయన నిర్వహించే ఫ్యాషన్‌ షోలలో అవకాశమిచ్చారు. అలా మోడలింగ్‌లో అడుగుపెట్టా. తర్వాత్తర్వాత ఫ్యాషన్‌ షోలతోపాటు ప్రకటనలూ చేసే అవకాశం వచ్చింది. నల్లి సిల్క్స్‌, చెన్నై సిల్క్స్‌, ఫాస్ట్‌ట్రాక్‌, జోస్కో జ్యువెలరీస్‌, డెక్కన్‌ క్రానికల్‌కు మోడలింగ్‌ చేశాను. ఫాస్ట్‌ట్రాక్‌ ప్రకటనతో మంచి గుర్తింపు వచ్చింది.

    నాన్నికి ఇష్టం లేదు...

    నాన్నికి ఇష్టం లేదు...

    నిజానికి నేను సినిమాల్లోకి వెళ్లడం నాన్నకు ఇష్టం లేదు. నేను సక్సెస్ కాలేనని ఆయన అనుమానం. కానీ ఇప్పుడు మాత్రం నాన్న చాలా హ్యాపీ. వరుసగా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుంటే... చెప్పలేనంత అనందంగా ఉంది

    మొదటి సినిమాలు

    మొదటి సినిమాలు

    మోడలింగ్‌లోనూ విజయం సాధించిన తర్వాత సినిమా అవకాశం వచ్చింది. అందులోనూ నన్ను పరీక్షించుకుందామని ఓకే చెప్పానుతప్ప చిన్నప్పటి నుంచే నాకు సినిమా కలలు లేవు. కన్నడలో 'శంకర్‌ ఐపీఎస్‌' నా మొదటి సినిమా. తర్వాత మలయాళంలో 'థ్రిల్లర్‌', 'ఉప్పుకుందం బ్రదర్స్‌' సినిమాలు చేశాను. తర్వాత కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్రతో 'గాడ్‌ఫాదర్‌' సినిమా చేశాను.

    జస్ట్ మిస్...

    జస్ట్ మిస్...

    కన్నడ, మలయాళ సినిమాల్లో రెండేళ్లు చాలా ఓపిగ్గా పనిచేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. మమ్ముట్టితో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ చిన్న పిల్లలా కనిపిస్తున్నానని వద్దన్నారు. తెలుగులో నా మొదటి సినిమా 'ప్రేమ కావాలి' కావాల్సింది. మొదట ఒప్పందం కుదిరినా తర్వాత రద్దుచేసుకోవాల్సి వచ్చింది. తర్వాత 'చమ్మక్‌ చల్లో'లో అవకాశం వచ్చింది. దానిలో నాది పెద్ద పాత్ర కాదు. కానీ నటనకు అవకాశం ఉన్న పాత్రని చేశాను.

    'ఇద్దరమ్మాయిలతో' లోకి అలా....

    'ఇద్దరమ్మాయిలతో' లోకి అలా....

    'చమ్మక్‌ చల్లో' సినిమా విడుదల కాకముందే తెలుగులో 'ఇద్దరమ్మాయిలతో', 'పైసా'లో అవకాశం వచ్చింది. పైసాలో నాది ముస్లిం అమ్మాయి పాత్ర. కళ్లతోనే మాట్లాడుతుంది. ఆ పాత్ర చాలా కష్టం. నా ప్రతిభకు పరీక్ష అనుకొని చేశాను. నాకు బాగా గుర్తింపు వచ్చింది మాత్రం 'ఇద్దరమ్మాయిలతో'నే. తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడూ ఒకేసారి షూటింగ్‌లు జరిగాయి.

    లక్ష్యం...

    లక్ష్యం...

    సినిమాల ఎంపికలో అమ్మ సాయపడుతుంది. తను కూడా నాతోపాటే కథ వింటుంది. అప్పుడు ఇద్దరం ఒక నిర్ణయానికి వస్తాం. నాన్నకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. వ్యాపారంలో బిజీగా ఉంటారు. నా సినిమాల గురించి పట్టించుకోవడం చాలా అరుదు. సినిమాలతో నన్ను నేను నిరూపించుకున్నాను. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం.

    కార్తీతో చేస్తున్నా...

    కార్తీతో చేస్తున్నా...

    సినిమా ఎంపికచేసుకునేటపుడే విజయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే విజయం నా చేతుల్లో మాత్రమే ఉండదు కదా! అందుకే నేను చేసే ప్రతిసీనూ బాగా రావడానికి మాత్రం ప్రయత్నిస్తాను. దక్షిణాదిలో కన్నడ, మలయాళీ, తెలుగు సినిమాల్లో చేశాను. తమిళంలో కార్తీతో ఒక సినిమా చేయబోతున్నా!

    నా వయసుకు తగ్గవి....

    నా వయసుకు తగ్గవి....

    శాండల్‌వుడ్‌లో నాకంటే వయసులో చాలా పెద్దవాళ్లయిన హీరోలతో పనిచేశాను. టాలీవుడ్‌లో మాత్రం వరుణ్‌ సందేశ్‌, నాని, అల్లు అర్జున్‌ లాంటి యువ హీరోలతో అవకాశాలు వచ్చాయి. వాళ్లతో సులభంగా కలిసిపోగలుగుతున్నాను. నా వయసుకు తగ్గ పాత్రలూ వస్తున్నాయి. అంతకంటే శాండల్‌వుడ్‌, టాలీవుడ్‌ల మధ్య పెద్ద తేడా లేదు. యాక్షన్‌, కట్‌ అన్నిచోట్లా ఉండేదే.

    తెలుగు నేర్చుకుంటున్నా...

    తెలుగు నేర్చుకుంటున్నా...

    మాది కేరళ అయినా కూడా మలయాళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌ మాట్లాడతాం. హిందీ బాగా మాట్లాడగలను. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. నేను డైలాగులు చెప్పినదానికీ వేరేవాళ్లు డబ్బింగ్‌ చెప్పేదానికీ చాలా తేడా వస్తోంది. నేను చెబితే భావాలు వంద శాతం వ్యక్తమవుతున్నట్లు అనిపిస్తుంది. ముందు ముందు నేనే డబ్బింగ్‌ చెప్పాలనుకుంటున్నాను. అందుకే తెలుగు నేర్చుకుంటున్నాను.

    గ్రీన్‌పీస్‌కు మద్దతుగా...

    గ్రీన్‌పీస్‌కు మద్దతుగా...

    సినిమాలను పక్కనపెడితే పర్యావరణ సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాను. గ్రీన్‌పీస్‌కు మద్దతుగా ఉంటాను. 20-30 ఏళ్ల మధ్యవారు కెరీర్‌లోనే కాకుండా సామాజిక అంశాల్లోనూ బాధ్యతగా ఉండి ముందుకు నడవాలని నా అభిప్రాయం.

    ఫేస్‌బుక్‌లో లేను...

    ఫేస్‌బుక్‌లో లేను...

    మీరు నమ్మరేమో కానీ నేను ఫేస్‌బుక్‌లో లేను. అది టైమ్‌వేస్ట్‌ వ్యవహారమని నా ఉద్దేశం. నాకు కొత్త సంవత్సరం, పుట్టినరోజు, పండగరోజు... ఇలా ప్రత్యేకంగా ఒకరోజున తీర్మానాలు చేసుకునే అలవాటు లేదు. వాటిపైన నమ్మకమూ లేదు. ప్రతి రోజూ విలువైనదే. ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిన సందర్భం వస్తే ఆరోజే తీసుకుంటాను. అంతేకానీ వేచి చూడను.

    ఐయాం లక్కీ...

    ఐయాం లక్కీ...

    అల్లు అర్జున్‌ నానిలతో జతకట్టే అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. అది నా అదృష్టం. బన్నీ వేగంగా ప్రయా ణించే జలపాతం వంటి మనస్త త్వం గలవడైతే నాని ప్రశంతగా సాగే నది వంటి మనస్తత్వం గల వాడు. ఎవరి శైలిలో వారు గొప్ప వారు. వారితో చిత్రీకరణ సమ యంలో చాలా సంతోషంగా గొ ప్పగా ఉంటుంది.

    నా లోని ప్రధాన ఆకర్షణ

    నా లోని ప్రధాన ఆకర్షణ

    (నవ్వుతూ...) ‘‘నా కళ్లు. అవి చాలా అమాయకంగా ఉంటాయంటారు అందరూ. అంతేకాదు... నా ఫిజిక్ కూడా రొమాంటిగ్గా ఉంటుందని నా ఫ్రెండ్స్ అభిప్రాయం''. చదువులోనే కాదు, ఇతర అంశాల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. సంగీతం, డ్యాన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఐస్‌ స్కేటింగ్‌ చేయగలను. పదిమంది ముందు ధైర్యంగా నిలబడగలను. పాడటమూ వచ్చు. పియానో వాయించగలను. మోడలింగ్‌లోనూ విజయం సాధించాను.

    బయోడేటా...

    బయోడేటా...

    స్క్రీన్‌ నేమ్‌ : కేథరిన్‌
    పూర్తిపేరు : కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌
    పుట్టినతేది : 10 సెప్టెంబర్‌ 1985
    జన్మస్థలం : దుబాయ్‌
    వృత్తి : మోడల్‌, నటి
    తొలిచిత్రం : శంకర్‌ ఐపీఎస్‌ (కన్నడ - 2010లో)
    మలిచిత్రం : ది థ్రిల్లర్‌ (మలయాళం - 2010లో)
    తొలి తెలుగు చిత్రం : చమ్మక్‌ చల్లో (2013)
    చేసినవి : ఇద్దరమ్మాయిలతో, పైసా.. ఇంకా... ‘విష్ణు' (కన్నడ - 2010), ‘గాడ్‌ఫాదర్‌' (కన్నడ - 2013)

    English summary
    Catherine Tresa is an Indian film actress and model, known for her works in South Indian film industry. Since 2010, She has acted in Kannada, Malayalam and Telugu films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X