twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలచందర్‌కు ప్రముఖుల అంతిమ వీడ్కోలు (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    చెన్నై: అనారోగ్యంతో మరణించిన ప్రముఖ దర్శకుడు బాలచందర్ భౌతిక కాయాన్ని పలవురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. బాలచందర్ మరణంతో శోక సముద్రంలో మునిగి పోయిన ఆయన కుటుంబ సభ్యులను సినీ నటులు రజనీకాంత్, రాధిక, శరత్ కుమార్ తదితరులు ఓదార్చారు.

    బాలచందర్ శిష్యుడు, సన్నిహితుడు కమల్ హాసన్‌కు....ఆయన చివరి చూపు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం బాలచందర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. 'ఉత్తమ్ విలన్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిపై కమల్ లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. బాలచందర్ మరణ వార్త తెలియగానే బుధవారం ఉదయం అమెరికా నుండి బయల్దేరారు. బుధవారం రాత్రికి ఆయన చెన్నై చేరుకోనున్నారు. నేరుగా బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించనున్నారు.

    స్లైడ్ షోలో ఫోటోలు....

    రజనీకాంత్

    రజనీకాంత్

    తన గురువు బాలచందర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న రజనీకాంత్. బాలచందర్ వల్లనే రజనీకాంత్ నటుడిగా పరిచయం అయ్యారు.

    కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ...

    కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ...

    దుఖ:సాగరంలో మునిగి పోయిన బాలచందర్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రజనీ.

    రాధిక

    రాధిక

    బాలచందర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న నటి రాధిక.

    శరత్ కుమార్

    శరత్ కుమార్

    బాలచందర్ పార్థివ దేహం వద్ద తమిళ నటుడు శరత్ కుమార్.

    విజయ్

    విజయ్

    కె బాలచందర్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న హీరో విజయ్.

    కుటుంబ సభ్యులు ఓదార్పు

    కుటుంబ సభ్యులు ఓదార్పు

    పలువురు ప్రముఖులు బాలచందర్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

    ఎందరికో లైఫ్

    ఎందరికో లైఫ్

    బాలచందర్ దర్శకుడిగా ఎందరో కొత్త వారికి లైఫ్ ఇచ్చారు. ఆయన ద్వారా పరిచయమైన వారంతా ఇపుడు పెద్ద స్టార్స్ అయ్యారు.

    తమిళ రాజకీయ ప్రముఖులు

    తమిళ రాజకీయ ప్రముఖులు

    పలువురు తమిళ రాజకీయ ప్రముఖులు కె.బాలచందర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

    అకస్మాత్తుగా...

    అకస్మాత్తుగా...

    బాలచందర్ ఆసుపత్రిలో చేరినప్పుడు కాస్త ఫర్వాలేదు అనే విధంగా ఆయన ఆరోగ్యం ఉంది. అయితే అకస్మాత్తుగా ఆయన మరణించడం అందరినీ విషాదంలో ముంచెత్తింది.

    తిరిగిరాని లోకాలకు...

    తిరిగిరాని లోకాలకు...

    బాలచందర్ తిరిగి రాని లోకాలకు వెళ్లి పోవడం సౌత్ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.

    కడచూపు కోసం...

    కడచూపు కోసం...

    బాలచందర్ కడసారి చూపు కోసం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చారు.

    మృదు స్వభావి

    మృదు స్వభావి

    బాలచందర్ చాలా మృదు స్వభావి. అందరితో కలివిడిగా ఉండటం ఆయనకు అలవాటు అని పలువురు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

    మంచి మనిషి

    మంచి మనిషి


    బాలచందర్ ఎంతో మంచి మనిషి అని, తన వల్ల అయ్యే సహాయం తప్పకుండా చేసే వారని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

    రోల్ మోడల్

    రోల్ మోడల్

    బాలచందర్ ఎందరో దర్శకులకు, నటులకు రోల్ మోడల్ లాంటి వారు.

    రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా

    రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా

    బాలచందర్ తొలుత రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆతర్వాత దర్శకుడిగా మారారు. నిర్మాతగా సినిమాలు నిర్మించారు. కొన్ని చిత్రాల్లో నటించారు.

    మహిళా ప్రధానమైన సినిమాలు

    మహిళా ప్రధానమైన సినిమాలు

    బాలచందర్ తీసిన చిత్రాల్లో ఎక్కువగా సామాజిక అంశాలను స్పృషించే సినిమాలు, మహిళా ప్రధానమైన సినిమాలు ఉన్నాయి.

    యదార్థ సంఘటనలు

    యదార్థ సంఘటనలు

    యదార్థ సంఘటనలకు దగ్గరగా బాలచందర్ సినిమాలు ఉండేవి.

    అంతిమయాత్ర

    అంతిమయాత్ర

    బాలచందర్ అంతిమ యాత్రలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

    English summary
    Photos Of Celebrities Pay Tribute To Legendary Film Director K Balachander
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X