»   » ఆ నవల ఆధారంగానే ‘జ్యోతిలక్ష్మి’ మూవీ: పూరి (ఫోటోస్)

ఆ నవల ఆధారంగానే ‘జ్యోతిలక్ష్మి’ మూవీ: పూరి (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఛార్మి ముఖ్య పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న సినిమా ‘జ్యోతి లక్ష్మి'. సి.కె.ఎంటర్టెన్మెంట్స్, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ పతాకాలపై శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జ్యోతి లక్ష్మి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. హీరోయిన్ చార్మి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...జ్యోతి లక్ష్మి చిత్రం ‘మిసెస్ పరాంకుశం' నవల ఆధారంగా తెరకెక్కించాను. ఈ సుప్రసిద్ధ నవలను ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసారు. దాదాపు ఆరేళ్ల నుండి ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికి వీలైంది. ఈ ట్రెండుకు తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసి సినిమాను తీసాం. గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమా విషయంలో నాకు సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు....

యువత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ...పూరి గారితో పని చేయాలని గత ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. జ్యోతి లక్ష్మి సినిమా యూత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ మూవీ అని తెలిపారు.

ఆ నవల ఆధారంగానే ‘జ్యోతిలక్ష్మి’ మూవీ: పూరి (ఫోటోస్)

ఈచిత్రం ఆడియోను మే చివరి వారంలో విడుదల చేసి జూన్ మొదటి వారంలోగానీ, రెండో వారంలోగానీ సినిమాను విడుదల చేయబోతున్నారు.

నటీనటులు

ఈ చిత్రంలో చార్మి టైటిల్ రోల్ చేస్తుండగా, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరా: పి.జి.విందా, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాత్

English summary
Telugu movie Jyothi Lakshmi Movie First Look Launch starring Charmi Kaur in the lead Role. The movie Directed by Charmi Kaur.
Please Wait while comments are loading...