» 

నా మీద నమ్మకముంటే ఈ సినిమాకి రండి.... చార్మి

Posted by:

Charmi
నామీద నమ్మకంతో అందరూ సినిమా చూడొచ్చు. దర్శకుడి మీద నమ్మకంతో నేను సినిమా చేశాను అంటూ చార్మి స్టెట్ మెంట్స్ ఇస్తోంది. తాజాగా ఆమె నటించిన 'మంగళ' గురించి ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అలాగే... డబ్బింగ్ చెప్పిన ప్రతిరోజూ నిద్రపట్టేది కాదు. ఇంకా అదే హ్యాంగోవర్‌లో ఉన్నాను. స్క్రీన్‌ప్లే భయపెడుతుంది. మంత్ర థ్రిల్లర్ అయితే మంగళ హారర్ సినిమా. చిన్నపాటి డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. నా పాత్ర గ్లామర్‌గా ఉంటుంది'' అని చెప్పుకొచ్చింది. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.హెచ్.వి.శర్మ, ఓషో తులసిరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 2న విడుదల చేస్తారు.

సూభాష్, ప్రదీప్‌రావత్, రామ్‌జగన్, విజయ్, ఉత్తేజ్, సారికా రామచంద్రరావు, పావల శ్యామల, ఆనంద్ భారతి, సప్తగిరి, ప్రియ ఇతర పాత్రధారులు.మాటలు: జంధ్యం వెంకటేష్, నృత్యాలు: శేఖర్, ఫైట్స్: గణేష్, కళ: విశాల్, కూర్పు: శీను, కెమెరా: శివేంద్ర, సంగీతం: విశ్వ, సమర్పణ: గంగపట్నం శ్రీధర్, సహ నిర్మాత: బి.నాగేశ్వరరెడ్డి, నిర్మాతలు: సి.హెచ్.వి.శర్మ, ఓషో తులసీరామ్.

Read more about: చార్మి, ఓషో తులసీరామ్, మంత్ర, శ్రీకాంత్, సేవకుడు, మంగళ, sye aata, charmi, ajay, sevakudu, srikanth, mangala
English summary
Charmi starrer Mangala is all set to hit the big screens on 2nd March on the eve of Maha Shivaratri. Mangala is directed by Osho Tulasi Ram, who has earlier directed Mantra and made it an all-time hit for Charmi. Just like Mantra, Mangala is also a suspense thriller.
Please Wait while comments are loading...