twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెక్ పెట్టారు: పైరసీ పై 'బాహుబలి' టీమ్ ఎటాక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా పాటల్ని ఈ నెల 13న ,తిరుపతిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా నిన్న టి రోజున వాట్సప్ లో ఈ చిత్రంలోని పాటలు బయిటకు వచ్చేసాయి. దాంతో ఈ పైరసీకు చెక్ పెట్టడానికి బాహుబలి టీమ్ సిద్దమైంది. ఓ ఐడియాతో ముందుకు వచ్చారు. ఇంతుకు ముందు నాగచైతన్య..దోచేయ్ సినిమాకు చేసినట్లే ఈ సారి వీరు కూడా యూట్యూబ్ ద్వారా పైరసీకు చెక్ పెడుతున్నారు. ఇంతకీ ఏంటా ఐడియా...అంటే

    జూక్ బాక్స్ లు, ఆన్ లైన్ డౌన్ లోడ్ లు వచ్చాక...సినిమా ఆడియో సీడిలు సేల్స్ చాలా నామినల్ గా మారిపోయాయి. దాంతో..బాహుబలి టీమ్..రోజుకో పాట చొప్పున యూ ట్యూబ్ లో విడుదల చేయాలని నిర్ణయించుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవటం మొదలెట్టింది. దాంతో బ్యాడ్ క్వాలిటీ సాంగ్స్ బయిటకు రావటం..బ్యాడ్ అవటం ఉండదని భావిస్తున్నారు. ఈ ఆడియో విందామనుకునేవారు...యూ ట్యూబ్ లో వింటారు లేదా ఇంకా క్వాలిటీ కావాలనుకుంటే సీడీలు కొనుక్కుంటారు.

    ఈ స్టాటజీలోని భాగంగా... బాహుబలి టీమ్ అఫీషియల్ గా తమ చిత్రంలోని 'శివుని ఆన' పూర్తి సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాట ఇప్పుడు సినీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది. మీరూ ఈ పాటని వినండి.

    చిత్రం ఆడియోను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మైదానంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

    ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

    CHECK OUT: Baahubali Team Counter Attack On Piracy

    భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Baahubali team has decided to release a song each day for free on YouTube, until the audio release. Now, this brave step might atleast curb the wide spread of bad quality songs and people who would prefer still a better quality audio, will anyways opt to buy CDs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X