»   »  ‘బాహుబలి’ కష్టాలు: తోపులాట, లాఠీ చార్జ్ (ఫోటోస్)

‘బాహుబలి’ కష్టాలు: తోపులాట, లాఠీ చార్జ్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' కోసం గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు సినిమా శుక్రవారం(జులై 10) విడుదల కావడంతో థియేటర్ల వైపు పోటెత్తారు. హైదరాబాద్ నగరంలో 95% థియేటర్లలో ‘బాహుబలి' సినిమానే ప్రదర్శించారు. మహా నగరంలో దాదాపు వందకు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.

థియేటర్ల వద్ద జనం పోటెత్తడంతో ధియేటర్ల వద్ధ తోపులాటలు, లాఠీఛార్జీలు చోటుచేసుకున్నాయి. బాహుబలి టికెట్ల కోసం దాదాపు వారం నుండి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా ప్రతి థియేటర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు.


బ్లాక్ టికెట్ల దందా అడ్డుకునేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నా బ్లాక్ మార్కెటింగ్ ఆగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్ తీసుకున్న పలువురి టికెట్లు చెల్లకపోవటంతో ధియేటర్ల యజమాన్యాలతో వాదనలు వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసి క్రాస్‌రోడ్డులోని దేవి, సుదర్శన్ ధియేటర్ల వద్ధ ఇసుకేస్తే రాలనంత జనం కన్పించింది.


ఆరాధన, విజయలక్ష్మీ ధియేటర్ల వద్ధ ప్రేక్షకులు టికెట్ల కోసం ఆందోళనలు చేశారు. ఇందులో భాగంగా సహనం కోల్పోయిన పలువురు విజయలక్ష్మి ధియేటర్ ముందు రాళ్లు రువ్వటంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బాహుబలి సినిమా విడుదల సందర్భంగా భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...


సుదర్శన్


ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు, భారీగా ప్రేక్షకులు.


టికెట్ల కోసం


ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ వద్ద టికెట్ల కోసం అభిమానుల పడిగాపులు.


దేవి థియేటర్ వద్ద


ఆర్టీస్ క్రాస్ రోడ్ దేవి థియేటర్ వద్ద బాహుబలి సినిమా జనసందోహం.


లాఠీ


తార్నాకలోని ఆరాధన థియేటర్ వద్ద లాఠీ ఝులిపిస్తున్న పోలీసు


మంజు


మంజు థియేటర్ వద్ద పరిస్థితి ఇదీ...


ఆరాదన


తార్నాకలోని ఆరాధన థియేటర్ గే్ట్లు మూయడంతో బయట అభిమానుల ఆందోళన.


గబ్బర్ సింగ్ గ్యాంగ్


ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గబ్బర్ సింగ్ గ్యాంగ్ సందరడి..స


కొట్లాట


థియేటర్ల వద్ద టికెట్ల కోసం జరిగిన గొడవలో కొట్టుకుంటున్న దృశ్యం.


పడిగాపులు


అడ్వాన్స్ బుకింగ్ కోసం థియేటర్ల వద్ద అభిమానుల పడిగాపులు.


బ్యాండ్ బాజా


థియేటర్ల వద్ద బ్యాండ్ బాజాలతో సందడి.


పోలీసులు


బ్లాక్ మార్కెటింగ్ జరుగకుండా పోలీసుల సమక్షంలో టికెట్ల అమ్మకం.


English summary
Baahubali fans lathi charged in Hyderabad.
Please Wait while comments are loading...