»   » చిరు 150’: స్లోవేనియా, క్రోయేషియాలో షూటింగ్ (ఫోటోస్)

చిరు 150’: స్లోవేనియా, క్రోయేషియాలో షూటింగ్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు.

వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ .. అన్న ట్యాగ్‌లైన్‌కి త‌గ్గ‌ట్టే ఇప్ప‌టికే పోస్ట‌ర్లు యువ‌త‌రంలోకి దూసుకెళ్లిపోయాయి.


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెంట్రల్ యూరఫ్‌లోని స్లోవేనియా, క్రోయేషియాలో జరుగుతోంది. అక్కడ షూటింగుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సుష్మితతో పాటు చిత్ర యూనిట్ విడుదల చేసింది.


సుష్మిత ట్వీట్

స్లోవేనియా, క్రోయేషియాలో ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయని, ఇంతకంటే మించిన బెటర్ వర్క్ ప్లేస్ ఎక్కడా ఉండదేమో అంటూ సుష్మిత ట్వీట్ చేస్తూ కొన్ని ఫోటోస్ పోస్టు చేసింది.


పాట చిత్రీకరణ

కొరియోగ్రాఫర్స్ జానీ మాష్ట‌ర్, శేఖ‌ర్ మాష్ట‌ర్‌ నేతృత్వంలో.... చిరంజీవి, కాజల్ మీద పాట‌ల చిత్రీకరిస్తున్నారు. జానీ, శేఖర్ తమ కెరీర్లోనే ది బెస్ట్ అనేలా ఈ పాటలకు కొరియోగ్రఫీ డిజైన్ చేసారట.


ప్రకృతి సోయగం

స్లోవేనియా, క్రోయేషియాలో నేచర్ ఎంతో అందంగా ఉందంటూ.....సుష్మిత ఈ ఫోటోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేసారు.


కాజల్ పరివారం

క్రోయేషియాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తన అనుచరగణంతో కాజల్. ఇదంతా హీరోయిన్ బాగోగులు, మేకర్, ఇతరత్రా పనులు చూసుకునే టీం అన్నమాట. ఈ టీంలో కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా ఉన్నారు.


స్లోవేనియా షూట్ లో కాజల్

స్లోవేనియాలో జరుగుతున్న షూటింగ్ సమయంలో హీరోయిన్ కాజల్.


చిరు కూతురు

ఈ చిత్రానికి మెగాస్టార్ త‌న‌య సుశ్మిత డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. మెగాస్టార్‌ని త‌న కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్‌గా సుశ్మిత డిజైన్స్ ఆవిష్క‌రించాయ‌న్న టాక్ వ‌చ్చింది.


వినాయక్

ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండటంతో 2017 మోస్ట్ అవైటింగ్ మూవీగా ఖైదీ నంబ‌ర్ 150 గురించి ఇంటా బైటా చ‌ర్చ సాగుతోంది. ప్రీరిలీజ్ బిజినెస్‌లోనూ బాస్ అంతే స్పీడ్ చూపించ‌డం సౌత్ ఇండ‌స్ట్రీస్‌, ఓవ‌ర్సీస్‌లో హాట్ టాపిక్ అయ్యింది.


సంక్రాంతి రిలీజ్

అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా సినిమా రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ తెలిపారు.


విలన్

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట‌త‌ర‌ణి క‌ళాద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... ఏమైంది?

చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


చిరు 'ఖైదీ నంబర్‌ 150' ...సీన్ లోకి సుకుమార్ అసెస్టెంట్

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రోజుకో వార్త.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయమై.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెగా ఫ్యామిలీ జరుపుకున్న దీవాళి సెలబ్రేషన్స్ కి పవన్ హాజరు కాకపోవడం అగ్గికి ఆజ్యం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేంయడి


ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

కొద్ది రోజుల క్రితం ...అంటే ప్రభాస్ పుట్టిన రోజుకి సరిగ్గా ఒక్క రోజు ముందర రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఖైదీ నెంబర్ 150 సెట్ కు వెళ్లి .... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


చిరంజీవి ఈ వయస్సులో ఇలా ....గ్రేట్ అనిపిస్తుంది కదూ

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ..గ్రేట్ అనిపిస్తుంది కదూ (వీడియో కోసం క్లిక్ చేయండి)


పాజిటివ్-నెగెటివ్ : ఖైదీ 150 లుక్ పై ప్రముఖుల కామెంట్స్

అరవై దాటినప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ‘ఖైదీ నెంబర్‌ 150' సినిమా పోస్టర్‌లను చూస్తే ఎవరైనా ఆ మాట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


English summary
"KhaidiNo150 songs shoot in Slovenia and Croatia! FallColors..Natureitsbest. Couldn't have found a better work place." Sushmita Konidela Via Twitter.
Please Wait while comments are loading...