» 

‘కెమిస్ట్రీ’: నో బూతులు-ఓన్లీ చిలిపి వేషాలు (ఫోటోలు)

Posted by:

హైదరాబాద్: శ్రీ రాం కొడాలి, అమితారావ్ నాయకా నాయికలుగా వాచెస్పతి దర్శకత్వంలో వివిడ్ జర్నీ బ్యానర్ పై వస్తున్న చిత్రం "కెమిస్రీ - మనసుకీ మనసుకీ మధ్య" ఆడియో జనవరి 21న విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విశ్వనాధ్ ఘంటసాల సంగీతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలను మధుర ఆడియో విడుదల చేసాము. మా సినిమా పాటలకు చక్కటి ఆదరణ లభిస్తోంది. అలాగే అర్.పి.పట్నాయక్ పాడిన నీతో ప్రతిక్షణం పాటకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతునాయి. త్వరలోనే సినిమాని కూడా రిలీజ్ చేస్తాము అన్నారు.

దర్శకులు మాట్లాడుతూ ప్రేమ చిత్రాలకి సంగీతం చాలా ముఖ్యం మా సినిమాకి సంగీత దర్శకుడు విశ్వనాధ్ ఘంటసాల మంచి సంగీతం అందించారు అలాగే కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం మా పాటలకి ప్రాణం పోశాయి. "పరిచయం నుంచి పరిణయం దాక ఒక జంట మధ్య జరిగిన చిలిపి సన్నివేషాలు, సరదాలు చిన్న చిన్న తగువులు అద్భుతంగా పండాయి.

చూస్తున్న ప్రేక్షకులు తెర పై జరుగుతున్న కథలో తమను తాము ఊహించుకునే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దటం జరిగింది. యువకుల నుండి మధ్య వయస్కుల దాకా అందరూ తమ జీవితంలో తమ భాగస్వామితో జరిగిన సందర్భాలను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటారు. చిన్న సినిమా అంటే ద్వందార్ధాలు అనే బ్రమలో ఉన్నారు. మా కెమిస్ట్రీ సినిమాలో అలాంటివి ఏమీలేవు మా సినిమా క్లీన్ అండ్ నీట్ ఫిల్మ్. ఊహ తెలిసిన పిల్లాడు దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరు ఎంజాయ్ చేస్తారు అన్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫి - చక్రధర్, ఎడిటింగ్ - నికోలస్, సాహిత్యం - కిట్టు విస్సాప్రగడ, సంగీతం - విశ్వనాధ్ ఘంటసాల, నిర్మాణం - ఉదయ్ కుమార్, కో - ప్రొడ్యూసర్ - జి .శ్రీనివాస్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - వాచెస్పతి జొన్నలగడ్డ.

కెమిస్ట్రీ మూవీలో శ్రీరాం కొడాలి, అమితారావ్.

కెమిస్ట్రీ మూవీలో శ్రీరాం కొడాలి, అమితారావ్.

కెమిస్ట్రీ మూవీలో శ్రీరాం కొడాలి, అమితారావ్.

కెమిస్ట్రీ మూవీలో శ్రీరాం కొడాలి, అమితారావ్.

కెమిస్ట్రీ మూవీలో శ్రీరాం కొడాలి, అమితారావ్.

See next photo feature article

కెమిస్ట్రీ మూవీలో శ్రీరాం కొడాలి, అమితారావ్.

Read more about: tollywood, chemistry, టాలీవుడ్, కెమిస్ట్రీ
English summary
Sri Ram Kodali, Amitha Rao starrer Chemistry Movie currently in post production work. Uday Kumar produce this movie under Vivid Journey Banner. Vachespati Jonnalagadda directs this movie.
Please Wait while comments are loading...