»   » చిరు బర్త్ డే సెలబ్రేషన్స్: వరుణ్ ఏడ్చిన రోజు, సొంత నిర్మాణంపై చెర్రీ (ఫోటోస్)

చిరు బర్త్ డే సెలబ్రేషన్స్: వరుణ్ ఏడ్చిన రోజు, సొంత నిర్మాణంపై చెర్రీ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలోకి 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన 61వ జన్మదిన వేడుకలను అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా నిర్వహించారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చిరంజీవ పుట్టినరోజు సందర్భంగా 'ఖైదీ నెం. 150' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ వేడేకలో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న మెగా అభిమానులను సత్కరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ..అభిమానుల ఆదరణ వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని, మేం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటామని తెలిపారు.

నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా గత పది రోజులుగా అభిమానులు చేసిన సేవా కార్య‌క్ర‌మాలు.. పూజ‌లు..చూసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. అభిమానులు మా కుటుంబ సభ్యులే. సినిమాలు హిట్ అవ్వ‌చ్చు ఫ్లాప్ అవ్వ‌చ్చు కానీ అభిమానం ఎప్పుడూ శాశ్వతంమా బ్యాన‌ర్ లో నాన్న గారు ఫ‌స్ట్ హీరో అవ్వ‌డం పూర్వ జ‌న్మ‌సుకృతం. అని తెలిపారు.

తనకు అసలు సొంతగా సినీ నిర్మాణ సంస్థను స్థాపించాలనే ఆలోచన లేదని, అమ్మ కోరిక మేరకే కొణిదెల ప్రొడక్షన్ స్థాపించానని, ఆ బ్యానర్లో తొలి సినిమా నాన్నగారితో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోస్..

హీరోవ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ

``నేను పెద్దనాన్నకు పెద్ద ఫ్యాన్ ని. ఆయ‌న సినిమాలు ఆపేసి రాజకీయాల‌కు వెళ‌తాను అన్న‌ప్పుడు గ‌దిలోకి వెళ్లిపోయి ఏడ్చేశాను' అని తెలిపారు.

ఇపుడు హ్యాపీ

ఆయన్ను నేను సినిమా చేయమని చాలాసార్లు అడిగాను కూడా. అయితే ఆయన 9 ఏళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు. అందుకు నేను కూడా ఆయన అభిమానిగా చాలా సంతోషిస్తున్నాను అన్నారు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ డైలాగ్ కేక

చాలా మందికి చిరంజీవి గారు సినిమాలో ఇంత‌కు ముందులా డ్యాన్స్ చేయ‌గ‌ల‌డా అని అనుకుంటున్నారు వారంద‌రికీ నా స‌మాధానం...కాశీకి వెళ్లాడు కాషాయం క‌ట్టాడు త‌న వ‌రుస మారింది అనుకుంటున్నారేమో...అదే స్పీడు అంటూ డ్యాన్స్ , ఫైట్స్ తో ఆయన అదరగొడతారు అని వరుణ్ తేజ్ అన్నారు.

అల్లు అర్జున్

ప్రపంచంలో ఎంతో మంది పెద్ద హీరోలు ఉండ‌చ్చు. కానీ ఇంత పెద్ద రేంజ్ లో ఫంక్ష‌న్ చేసే అభిమానులు మాత్రం ఎవ‌రికీ ఉండ‌రు. అది చిరంజీవిగారికి మాత్రమే సాధ్యమని తెలిపారు అల్లు అర్జున్.

వివి వినాయక్

వినాయక్ మాట్లాడుతూ ``చిరంజీవి గారి 61 పుట్టిన‌రోజు అంటున్నారు కానీ... ఆయన వయసు 21 మాత్రమే అని చమత్కరించారు.

డైలాగ్

ఖైదీ నెం 150వ చిత్రంలో చిరంజీవి గారి డైలాగ్ ను వివి వినాయక్ చెబుతూ...ఓరేయ్ పొగ‌రు నా ఓంట్లో ఉంట‌ది... హీరోయిజం నా ఇంట్లో ఉంట‌ది' అంటూ తన వెనకే ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలను చూపించడం గమనార్హం.

నాగ బాబు

మాట్లాడుతూ ``ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ సంవ‌త్స‌రం కూడా చాలా సంతోషంగా అన్న‌య్య పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న అభిమానుల‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు`` అన్నారు.

అరవింద్

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ``చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 15 సంవత్సరాలుగా నడుస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడటంతో తన వంతు పాత్రను పోషించింది. అందుకు కారణం మెగాభిమానులే. వారు అందించిన సహకారమే. అందుకని వారిలో ఎక్కువ సార్లు బ్ల‌డ్ డోనేట్ చేసిన వారికి అవుట్ స్టాండింగ్ బ్ల‌డ్ డోన‌ర్స్ అవార్డ్స్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ సక్సెస్ లో కారణమై వారందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం`` అన్నారు.

శిరీష్

అల్లు శిరీష్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి వ‌న్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారు మాత్రమే అన్నారు.

సాయి ధరమ్ తేజ్

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ ``ఇది ఒక మెగా పండుగ. ఖైదీ నెం 150 ఫ‌స్ట్ లుక్ నాకు చాలా బాగా నచ్చింది, అందిరి పోయింది`` అన్నారు.

సంతోషం

చిరంజీవిగారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్...మీ అంద‌రిలాగే నేను కూడా ఖైదీ నెం 150వ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.

 

 

శిల్పకళా వేదిక వద్ద

చిరంజీవి 61వ జన్మదిన వేడుకలు శిల్పకళా వేదిక వద్ద  గ్రాండ్ గా జరిగాయి.

శిల్పకళా వేదిక వద్ద

చిరంజీవి 61వ జన్మదిన వేడుకలకు సంబంధించిన ఫోటోస్

శిల్పకళా వేదిక వద్ద

చిరంజీవి 61వ జన్మదిన వేడుకలు

రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి 61వ జన్మదిన వేడుకల సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతున్న దృశ్యం.

అల్లు అర్జున్

మెగాస్టార్ చిరంజీవి 61వ జన్మదినం సందర్భంగా అల్లు అర్జున్ స్పీచ్.

అల్లు అరవింద్

సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్న అభిమానులను సత్కరిస్తున్న అరవింద్

స్టార్స్

చిరంజీవి 61వ జన్మదిన వేడుకలో మెగా ఫ్యామిలీ స్టార్స్.

చెర్రీ

మెగాస్టార్ చిరంజీవి 61వ జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడుతున్న రామ్ చరణ్

బన్నీ, వినాయక్

చిరంజీవి 61వ జన్మదిన వేడుక సందర్భంగా బన్నీ, వినాయక్

సాయి ధరమ్ తేజ్

చిరంజీవి 61వ జన్మదిన వేడుకలో సాయి ధరమ్ తేజ్.

రామ్ చరణ్

మాట్లాడుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

రామ్ చరణ్

మెగా పవర్ స్టార్

వరుణ్

హీరోయిన్లతో కలిసి వరుణ్ తేజ్

చెర్రీ, వినాయక్

చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ లో వినాయక్, రామ్ చరణ్

యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

యమున ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి

 

English summary
Ram Charan, Allu Arjun, Allu Aravind, Nagababu, VV Vinayak, Rashi Khanna, Rakul Preet Singh, Sai Dharam Tej, Varun Tej, Allu Sirish, Shreya Vyas, Nisha, Anchor Shyamala graced the event.
Please Wait while comments are loading...