twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొత్తం 76 వేలమంది: చిరంజీవి, రామ్ చరణ్ థాంక్స్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27ను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు భారీ ఎత్తున రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. రక్తదానం నిర్వహించిన అన్ని కేంద్రాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 76 వేల మంది అభిమానులు 76 వేల యూనిట్ల రక్తాన్ని దానం చేసారు.

    రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా గ్లోబల్ మెగా బ్లడ్ డొనేషన్ ఈవెంటును నిర్వహించిన బ్లడ్ బ్రదర్స్ కు హృదయ పూర్వక అభినందనలు తెలియజేసారు చిరంజీవి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని మిగతా ప్రాంతాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఉన్న మెగా అభిమానులు ఒకే రోజున రక్తదానం చేయడం అనిర్వచనీయం, అసాధారణం, అధ్బుతం అన్నారు.

    76 వేల మంది ఒకేసారి రక్తదానం చేయడం అంటే మామూలు విషయం కాదని, రామ్ చరణ్ కు ఇంతకు మించిన గొప్ప గిఫ్ట్ ఏముంటుంది? రక్తం లభించక ఎవరూ చనిపోకూడదూ అనే నా ఆశయాన్ని నెరవేర్చడానికి రెండు దశాబ్దాలకుపైగా మీరు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.

    తన 31వ పుట్టినరోజు సందర్బంగా ఇంత భారీ ఎత్తున రక్తదానం చేయడం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని విషయమని, చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ తెలిపారు. స్లైడ్ షోలో ఫోటోస్...

    రక్తదానం

    రక్తదానం

    మార్చి 27ను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు భారీ ఎత్తున రక్తదానం చేసిన ఫ్యాన్స్ ను అభినందిస్తున్న చిరంజీవి.

    76వేల మంది

    76వేల మంది

    రక్తదానం నిర్వహించిన అన్ని కేంద్రాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 76 వేల మంది అభిమానులు 76 వేల యూనిట్ల రక్తాన్ని దానం చేసారు.

    వరల్డ్ వైడ్

    వరల్డ్ వైడ్

    మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని మిగతా ప్రాంతాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఉన్న మెగా అబిమానులు రక్తదానం చేసారు.

    చిరంజీవి

    చిరంజీవి

    రక్తం లభించక ఎవరూ చనిపోకూడదూ అనే నా ఆశయాన్ని నెరవేర్చడానికి రెండు దశాబ్దాలకుపైగా మీరు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు చిరంజీవి.

    English summary
    Earlier today, Ram Charan and Chiranjeevi met and greeted the blood donors and organisers, who contributed dearly towards the success of the mega blood donation camps organized across various parts of the world. The blood donation camp, which was organized on March 27, attracted over 76,000 blood donors from different walks of life. The initiative was declared a massive success and many blood seekers benefited out of it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X