twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విదేశీ దేవాలయానికి చిరంజీవి విరాళం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా నేపాల్‌లోని పశుపతినాథ్ టెంపుల్‌ను దర్శించుకున్న సంగతి తెలిసిందే. పరమ శివుడికి సంబంధించిన ఈ దేవాలయం 5వ శతాబ్దంలో నిర్మించారు. ఆయల కమిటీ నుండి అందిన సమాచారం ప్రకారం చిరంజీవి ఈ దేవాలయానికి రూ. 2 లక్షల విరాళం ఇచ్చి ప్రత్యేక పూజలు జరిపించినట్లు తెలుస్తోంది.

    చిరంజీవి కంటే ముందు ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయానికి మోడీ రూ. 2 కోట్ల విలువ చేసే 2,500 కేజీల ఎర్రచందనం దుంగలను విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. అదే విధంగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల దేవాలయాన్ని సందర్శించి రూ. 5,100 విరాళం ప్రకటించారు.

    Chiranjeevi donation to Pasupathinath Temple

    ఇక చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే......
    త్వరలోనే సినిమా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సినిమా సబ్జెక్ట్‌ అందరినీ అలరించే విధంగా ఉంటుంది. ప్రేక్షకులకు మెసేజ్‌ ఇచ్చే విధంగా సందేశాత్మక చిత్రం తీస్తే మన ప్రేక్షకులు చూసే పరిస్థితి లేదు. అందుకే శంకర్‌దాదా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాన్నే చేస్తాను అన్నారు చిరంజీవి.

    ప్రస్తుతం ప్రొడక్షన్‌ ఖర్చు బాగా పెరిగింది. నిర్మాత బాగు కోసం వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. హీరో, హీరోయిన్ల పారితోషికం నుంచి రకరకాల ప్రొడక్షన్‌ ఖర్చుల దాకా అన్నింటినీ పరిశీలించి తక్కువ బడ్జెట్‌తో 150 సినిమా చేస్తానని చిరంజీవి అంటున్నారు. చిరంజీవి 150వ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా ఉండబోతున్నారు.

    English summary
    According to Pashupati Area Development Trust chief Govinda Tandon, Chiranjeevi offered Rs 2 lakhs for a special puja conducted at Pasupathinath Temple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X