twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య తొలి విజయం, ఆయనకు అవలీల: చిరంజీవి

    |

    హైదరాబాద్: గౌతమిపుత్ర శాతకర్ణిగా నందమూరి బాలకృష్ణ నటించడం తనకెంతో ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను గౌతమిపుత్ర శాతకర్ణి కథను ఎంచుకోవడం తొలి విజయమని ఆయన అన్నారు.

    శుక్రవారం ఉదయం జరిగిన బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ఈ చిత్రం బాలకృష్ణకు మైలురాయి వంటిదని అన్నారు. బాలకృష్ణ చరిత్రలో అపూర్వమైన సినిమాగా మిగిలిపోవడం ఖాయమని చిరంజీవి తెలిపారు.

    బాలకృష్ణ ఈ చిత్రానికి క్రిస్‌ని దర్శకుడిగా ఎంచుకున్నప్పుడే విజయం ఖరారైందని అన్నారు. ఈ చిత్రానికి క్రిస్ సరైన దర్శకుడని చెప్పారు. 2 ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'కంచె' అనే సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని చెప్పారు. క్రిస్ తోనే ఇలాంటి చిత్రాలు సాధ్యమని అన్నారు.

    ఈ చిత్రంలో అత్యద్భుత నటనతో బాలకృష్ణ అలరిస్తారని చిరంజీవి అన్నారు. అది బాలకృష్ణకు వెన్నెతో పెట్టిన విద్యేనని అన్నారు. ఈ చిత్రం సిల్బర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీగా మిగిలిపోవాలని చిరంజీవి కోరుకున్నారు. ఈ చిత్రం నిలిచిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

     Chiranjeevi on Balakrishna

    ప్రముఖ నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. సింహా, లయన్, లెజెండ్ అయిన బాలకృష్ణ తన మంచి స్నేహితుడు అన్నారు. 200రోజలపాటు వెయ్యి థియేటర్లలో ఆడుతుందని అన్నారు.

    ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. బాలయ్య సినీ చరిత్రలో వందో సినిమా ఓ మైలురాయిగా ఉంటుందని చెప్పారు. మొట్టమొదటి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణ కథని ఎంచుకోవడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయమని అన్నారు.

    ఉగాది, ఉగాది పచ్చడి.. గౌతమిపుత్ర శాతకర్ణితోనే ప్రారంభమైందన్నారు. ఈ సినియా ఆలోచన క్రిస్ కు రావడం, బాలయ్యను ఎంచుకోవడం మంచి విషయమని అన్నారు. బాలయ్య ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాడని అన్నారు. బాలయ్యను గౌతమిగా చూడటానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ చిత్రం చరిత్ర సృష్టించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.

    English summary
    Megastar Chiranjeevi on Friday praised Actor Nandamuri Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X