twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా 151: చిరంజీవి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్!

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు పాత్రలకు తగిన విధంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని టాక్.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'ఖైదీ నెం 150' సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.... 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఖరారయ్యారు.

    టాలీవుడ్ టాప్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ మెగాస్టార్ ఇమేజ్ కు తగిన విధంగా సినిమాటిక్ గా ఉయ్యాలవాడ కథను తీర్చి దిద్దారు. ఒరిజినల్ గా స్టోరీ ఎలా ఉన్నా క్షకులకు వినోదం పంచడానికి కొన్ని మార్పులు చేర్పులు సహజమే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ విషయంలోనూ అలానే చేసారట.

     మెగాస్టార్ ద్విపాత్రాభినయం

    మెగాస్టార్ ద్విపాత్రాభినయం

    ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు పాత్రలకు తగిన విధంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని టాక్. ఏప్రిల్‌ రెండో వారంలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలన్నాయని తెలుస్తోంది.

     పోరాటాలతో పాటు లవ్ స్టోరీ

    పోరాటాలతో పాటు లవ్ స్టోరీ

    సినిమాలో గెరిల్లా పోరాటాలతో పాటు అభిమానులను అలరించేలా ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి లవ్ స్టోరీ కూడా ఉంటుందని టాక్. ఉయ్యాలవాడ చరిత్ర చెబుతూనే అభిమానులకు కావాల్సిన వినోదం పంచేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారట.

    ఎవరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    ఎవరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

    భరణాన్ని రద్దు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం

    భరణాన్ని రద్దు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం

    18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.

    తిరుగుబాటు

    తిరుగుబాటు

    1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

     ఖజానాపై దాడి

    ఖజానాపై దాడి

    1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

     కాక్రేన్ సైన్యంతో ముట్టడించి

    కాక్రేన్ సైన్యంతో ముట్టడించి

    తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.

    30 ఏళ్ల పాటు తల వ్రేలాడ దీసారు

    30 ఏళ్ల పాటు తల వ్రేలాడ దీసారు

    నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

    English summary
    Film Nagar source said that, Chiranjeevi to play dual role in Uyyalawada Narasimha Reddy. The movie involves way too elements such as long action sequences and a triangle love story. Director Surender Reddy, who delivered a decent hit to Ram Charan with 'Dhruva' will likely direct the movie, which is still in the pre production stages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X