twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఖైదీ నంబర్ 150' గా చిరంజీవి, లీకెడ్ డైలాగు కేక

    By Srikanya
    |

    హైదరాబాద్: చిరంజీవి లేటెస్ట్ చిత్రానికి కత్తిలాంటోడు వద్దనుకుని,ఖైదీ నెంబర్ 150 అని పెట్టారా ఏంటి అని కంగారుపడకండి. ఇటీవలే షూటింగ్ ఆరంభమైన చిరు 150 వ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మంగళవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో చిత్రీకరించారు.ఖైదీ వేషధారణలో ఉన్న చిరంజీవి పాల్గొనగా సీన్స్ తీశారు. జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు తీశారని సమాచారం.

    ఈ సీన్ లో చిరంజీవి వేసుకున్న చొక్కాపై 150 అనే అంకెలు కనిపిస్తున్నాయి. బహుశా ఇది చిరంజీవికి 150వ చిత్రం కాబట్టి.. ఖైదీ నంబర్ 150 అని పెట్టారేమో. గతంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 786 అనే టైటిల్ తో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

    మరో ప్రక్క ఈ చిత్రంలో కొన్ని డైలాగులు లీక్ అయ్యాయంటూ ఈ క్రింద వాక్యాలు ప్రచారంలోకి వచ్చాయి.

    "దుక్కి దున్నడమే తెలుసు వీళ్లకి దుర్మార్గం చెయ్యడం తెలియదు

    నాగలి పట్టడమే తెలుసు వీళ్లకి నరకటం తెలియదు

    ఇప్పుడు మీరు వీళ్ల పొలాలకి నీళ్లు ఇవ్వకపోతే ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కల్ని నరకుతూ మీ గుండెల్ని దున్నుకు పోతారు."

    వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని, గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమాను మించే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్. అందుకే ఈ తాజా చిత్రంలోనూ అలాంటి డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

    రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఠాగూర్ తరహా డైలాగ్ ను ప్లాన్ చేస్తున్నాడు వినాయక్. అందుకోసం భారీగా రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల అప్పుడు, ఆత్మహత్యలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ కేటాయింపులు లాంటి విషయాలతో ఓ లెంగ్తీ డైలాగ్ ను రెడీ చేస్తున్నారు. మరీ డైలాగ్ కత్తిలాంటోడికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

     Chiranjeevi's 150th @ Chanchala Guda Jail

    వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ఈ షెడ్యూల్ వచ్చే నెల 12వరకూ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో సన్నివేశాలు చిరంజీవి గారి అభిమానులకు కానీ, థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకులకు కానీ చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా ఆయన గ్లామర్ చూసి చాలా ముచ్చటపడిపోతారు. అంత గ్లామర్ గా ఉన్నారు.

    ఇక సినిమాలో పరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా ఉంటారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తారు. చిరంజీవి గారి కొత్త లుక్ తో కూడిన టీజర్ ని కూడా అభిమానుల కోసం త్వరలో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత చేయబోయే షెడ్యూల్ భారీ షెడ్యూల్ ఉంటుంది. ఈ భారీ షెడ్యూల్లోనే హీరోయిన్ ఎంటర్ అవుతుంది.

    ఠాగూర్ తర్వాత చిరంజీవి గారితో మళ్లీ చాలా ప్రత్యేకమైన సినిమా చేస్తున్నాను. ఇది ఆయనకు 150వ సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతున్నాం. ఈ అవకాశం రావడమే చాలా ఆనందంగా ఫీలవుతున్నా. ఈ కథలో చిరంజీవి గారి నుంచి ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. కామెడీ, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉంటాయి.

    సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవిగారు నటిస్తున్నారు. ఈ కథని శ్రేయోభిలాషులందరికీ వినిపించడం జరిగింది. అలాగే చిరంజీవి గారితో పాటు నిర్మాత రామ్ చరణ్, ఫ్యామిలీ సభ్యులందరూ విని ఆనందించారు.వారందరూ ఒకే మాటగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది.

    చిరంజీవి గారు, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా వారందరూ ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది. టైటిల్ ని త్వరలోనే ప్రకటిస్తాం. చరణ్ ఈ సినిమాని భారీగా నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నారు. మంచి కథ, మంచి టెక్నీషియన్లతో సెట్స్ కొచ్చాం. అందుకు తగ్గట్టే సినిమా అద్భుతంగా వస్తుందని ధైర్యంగా చెప్పగలను.... అన్నారు.

    ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ , కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్.

    English summary
    Some of the initial portion of the Chiranjeevi's 150th film takes place in a prison. Chiranjeevi will play one of the inmates who escapes from the prison. To be directed by V.V. Vinayak, the film is the official Telugu remake of Tamil blockbuster Kaththi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X