twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 40 లక్షలతో చిరంజీవి సెటిల్మెంట్ చేయించారట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గత నెలలో గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా స్టోరీపై కొన్ని రోజులుగా వివాదం ఉన్న సంగతి తెలిసిందే.

    తమిళ 'కత్తి' చిత్రం స్టోరీ తనదే అంటే ఎం.నరసింహారావు అనే రచయిత చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇపుడు అదే కథను తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తుండంతో వివాదం మరింత హైప్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరగనిచ్చేది లేదంటూ గతంలో ఆయన ఆందోళన కూడా చేసాడు. ఈ స్టోరీపై ఆయన రైటర్స్ అసోసియేషన్లో పిర్యాదు కూడా చేసారు.

    chiru-ram

    ఈ గొడవ కారణంగా చిరంజీవి 150వ సినిమాకు చెడ్డపరేరు వచ్చే అవకాశం ఉండటం, తర్వాత ఇది సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉండటంతో రైటర్ తో సెటిల్మెంట్ చేసుకోవడానికే మొగ్గు చూపారు చిరంజీవి.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....రచయిత నరసింహారావుకు రూ. 40 లక్షలు ముట్టజెప్పడంతో పాటు టైటిల్ కార్డ్స్ లో కూడా ఆయన పేరు వేయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

    సౌత్ లో టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. చిరంజీవి గత చిత్రాలు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దేవిశ్రీ విజయవంతమైన సంగీతం అందించారు.

    English summary
    Film Nagae source said that, Chiranjeevi has called on writer Narasimha Rao who filed a case in writers association that the Choru's 150th film's story was stolen from a script he had written. It is heard that, the makers have accepted to accomplish Narasimha Rao's demands of giving due credit, besides compensating. So, all hurdles are clear for Chiru's comeback film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X