Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి డేట్ ఖరారైంది
హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో వివాహానికి సంబంధించిన సందడి ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో మొదలైంది. తాజాగా పెళ్లి డేట్ ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తునప్నాయి. ఫిబ్రవరి 25న వివాహం జరుగబోతున్నట్లు సమాచారం. ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా అఫీషియల్ గా బయటకు చెప్పడం లేదు మెగా ఫ్యామిలీ.
మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.... చిరంజీవి కాబోయే అల్లుడి గురించి వివరాలు బయటకు లీకయ్యినట్లు తెలుస్తోంది. శ్రీజ పెళ్లాడే వ్యక్తి పేరు కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడని టాక్. యూఎస్ఏలో బిజినెస్ మేన్ గా సెటిలైన ఎన్నారై. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చిరంజీవి తన ఇంట్లో పెళ్లి తంతులో పాల్గొన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అయితే అది శ్రీజ నిశ్చితార్థ వేడుక అని సమాచారం. మార్చి నెలలో పెళ్లి జరుగుతుందని, ఈ వివాహాన్ని గ్రాండ్ గా జరిపేందుకు చిరంజీవి నిర్ణయించారట. త్వరలోనే ఆయన ఈ విషయమై అపీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
తన క్లాస్ మేట్ కళ్యాణ్ ను పెళ్లాడటం ద్వారా శ్రీజ మళ్లీ కొత్తగా తన జీవితం ప్రారంభించబోతోంది. ఇన్నాళ్లు తన కూతురు భవిష్యత్తుపై చిరంజీవి కాస్త బెంగగా ఉండే వారు. ఇపుడు ఆమె రెండో పెళ్లి ద్వారా కొత్త జీవితం ప్రారంభిస్తుండటంపై ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు.
శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహరం గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న శ్రీజ....కొంత కాలం అతనితో కాపురం చేసి ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ అసలు రూపం తెలుసుకుని అతనికి దూరమైంది. శ్రీజ మొదటి పెళ్లి వ్యవహారం మెగా ఫ్యామిలీకి ఓ పీడకలలా ముగిసిందని కొందరు అంటుంటారు.